రో 'హిట్'కు ఏమైంది..? ముంబైపై భారీగా ట్రోల్స్

by Disha Web Desk 19 |
రో హిట్కు ఏమైంది..? ముంబైపై భారీగా ట్రోల్స్
X

దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్ 2022 అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఆటగాళ్లు భారీ స్కోర్లు చేస్తూ ఐపీఎల్ ప్రియులకు ఫుల్ కిక్ ఇస్తు్న్నారు. కొత్తగా వచ్చిన రెండు జట్లు అద్భుత ప్రదర్శన చేస్తున్నాయి. అయితే, ఐపీఎల్ చరిత్రలోనే మోస్ట్ సక్సెస్ ఫుల్ జట్లు అయిన ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ మాత్రం ఈ సీజన్‌లో దారుణంగా విఫలం అవుతున్నాయి. 5 సార్లు టైటిల్ విజేత అయిన ముంబై ఇండియన్స్ ఆటతీరుపై అభిమానులు మండిపడుతున్నారు. ముంబై కెప్టెన్ రోహిత్ శర్మపై సోషల్ మీడియాలో నెటిజెన్లు భారీగా ట్రోల్స్ చేస్తున్నారు.

ముంబై ఇండియన్స్ 5సార్లు టైటిల్ గెలవడానికి కారణం రోహిత్ కెప్టెన్సీ కాదనీ.. టీం ఇండియా కీలక ఆటగాళ్లు బుమ్రా, పాండ్యా బ్రదర్స్, ట్రెంట్ బౌల్ట్ ఉండడం వల్లే అని కామెంట్లు చేస్తున్నారు. ఈ సీజన్‌లో పాండ్యా బ్రదర్స్ లేకపోవడం వల్ల ముంబై దారుణంగా విఫలం అవుతుందని అంటున్నారు. అంతేకాకుండా బ్యాటింగ్‌లో రాణించలేకపోతున్న రోహిత్ శర్మ కెప్టెన్సీ వదిలి యువకులకు అవకాశం ఇవ్వాలంటూ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కెప్టెన్సీ భారం లేకపోతే రోహిత్ శర్మ ఒత్తిడి లేకుండా ఆడాగలడని.. హిట్ మ్యాన్ పుంజుకుంటే ముంబైకి తిరుగుండందని కామెంట్లు చేస్తున్నారు. స్టార్ బ్యాటర్లు సూర్య కుమార్ యాదవ్, ఇషాన్ కిషన్ సూపర్ ఫామ్‌లో ఉన్న.. మిగితా బ్యాట్స్ మెన్స్ రాణించకపోవడం వల్ల ముంబైకి ఓటమి తప్పడం లేదు. ఈ సీజన్‌లో ముంబై ఆడిన మూడు మ్యాచ్‌లలో ఓడిపోవడం గమనార్హం.

ఇక, ఈ సీజన్‌లో డిఫెండింగ్ చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ కూడా విఫలం అవుతోంది. సీజన్ ప్రారంభానికి ముందే ధోని కెప్టెన్సీని స్టార్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజాకు అప్పగించిన విషయం తెలిసిందే. జడేజా కెప్టెన్సీ‌లో చెన్నై వరుస ఓటములు చూడడంతో చెన్నై అభిమానులు తీవ్ర నిరాశలో ఉన్నారు. మళ్లీ ధోని కెప్టెన్సీ పగ్గాలు తీసుకుని చెన్నైను విజయాల బాటలో నడిపించాలని అభిమానులు కోరుతున్నారు. అంతేకాకుండా చెన్నై ఆటగాళ్లను గాయాల బెడద తీవ్రంగా వేధిస్తోంది. గత సీజన్ అత్యధిక పరుగుల వీరుడు, ఓపెనర్ బ్యాట్స్ మెన్ రుతురాజ్ గైక్వాడ్ ఈ సారి దారుణం విఫలం అవ్వడం కూడా చెన్నై ఓటమిపై ప్రభావం చూపిస్తోంది. తిరిగి ఆటగాళ్లు ఫామ్ లోకి వచ్చి జట్టును విజయాల బాటలో నడిపించాలని అభిమానులు కోరుకుంటున్నారు.

Next Story

Most Viewed