- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రేపటి నుంచి గిగ్ వర్కర్ల దేశవ్యాప్త సమ్మె
గిగ్ వర్కర్లు మరోసారి దేశవ్యాప్త సమ్మెకు దిగనున్నారు.

దిశ, వెబ్ డెస్క్ : గిగ్ వర్కర్లు మరోసారి దేశవ్యాప్త సమ్మెకు దిగనున్నారు. గిగ్ & ప్లాట్‌ఫామ్ సర్వీస్ వర్కర్స్ యూనియన్ (GIPSWU) జనవరి 26 నుంచి దేశవ్యాప్త ఆన్‌లైన్ సమ్మెకు పిలుపునిచ్చింది. ఈ సమ్మెలో భాగంగా గిగ్ వర్కర్లు స్విగ్గీ, జొమాటో, బ్లింకిట్, జెప్టో వంటి యాప్‌లను ఆఫ్ చేసి సమ్మెలో పాల్గొననున్నారు. అలాగే ఫిబ్రవరి 3న దేశవ్యాప్తంగా రోడ్లపై ఫిజికల్ ప్రొటెస్ట్‌లు కూడా నిర్వహించనున్నారు. మెరుగైన వేతనాలు, సరైన ఇన్సెంటివ్స్, హెల్త్ ఇన్సూరెన్స్, యాక్సిడెంట్ కవర్, పెన్షన్, PF/ESIC వంటి సామాజిక భద్రత, 10 నిమిషాల డెలివరీ మోడల్‌ను పూర్తిగా రద్దు చేయడం, అన్యాయంగా ఐడీలు బ్లాక్ చేయడం, పోలీస్ వేధింపులు ముగించడం వంటి డిమాండ్లతో ఈ సమ్మె చేస్తున్నారు.
జనవరి 26 నుంచి డెలివరీలు ఆలస్యమయ్యే అవకాశం ఉందని యూనియన్ తెలిపింది. కాగా గత డిసెంబర్ 31న సమ్మెకు పిలుపునివ్వగా.. కొన్ని ఇన్సెంటివ్స్ పెరిగాయని, అయినప్పటికీ సమస్యలు పూర్తిగా పరిష్కారం కాలేదని పేర్కొంది. తెలంగాణ గిగ్ అండ్ ప్లాట్‌ఫామ్ వర్కర్స్ యూనియన్ కూడా ఈ సమ్మెకు మద్దతు ఇస్తోంది.






