జెరోధా ఫౌండర్‌ నిఖిల్‌ కామత్‌తో నారా లోకేశ్‌ భేటీ

by Muthe.Rajitha |

దావోస్‌ పర్యటనలో భాగంగా ఏపీ మంత్రి నారా లోకేశ్‌ ప్రముఖ స్టాక్‌ బ్రోకింగ్‌ సంస్థ జెరోధా వ్యవస్థాపకుడు నిఖిల్‌ కామత్‌తో భేటీ అయ్యారు.

జెరోధా ఫౌండర్‌ నిఖిల్‌ కామత్‌తో నారా లోకేశ్‌ భేటీ
X

దిశ, వెబ్ డెస్క్ : దావోస్‌ పర్యటనలో భాగంగా ఏపీ మంత్రి నారా లోకేశ్‌ ప్రముఖ స్టాక్‌ బ్రోకింగ్‌ సంస్థ జెరోధా వ్యవస్థాపకుడు నిఖిల్‌ కామత్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా నారా లోకేష్.. విశాఖపట్నంలో టెక్నాలజీ డెవలప్‌మెంట్‌ సెంటర్‌ను ఏర్పాటు చేయాలని నిఖిల్‌ను కోరారు. ప్లాట్‌ఫామ్‌ ఇంజినీరింగ్‌, బ్యాక్‌ఎండ్‌ సిస్టమ్స్‌, ట్రేడింగ్‌ అల్గోరిథంలు, డేటా అనలిటిక్స్‌, ఫిన్‌టెక్‌ పరిశోధనలపై ఈ కేంద్రం దృష్టి పెట్టాలని తెలిపారు. అలాగే ఫిన్‌టెక్‌ స్టార్టప్‌లకు మద్దతు ఇవ్వడానికి రతన్‌ టాటా ఇన్నోవేషన్‌ హబ్‌తో కలిసి లీడ్‌ మెంటర్‌గా పని చేయాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రవ్యాప్తంగా పాఠశాల నుంచి కళాశాల స్థాయి వరకు ఫైనాన్షియల్‌ లిటరసీ కార్యక్రమాన్ని అమలు చేయడంలో ఏపీ ప్రభుత్వంతో సహకరించాలని కోరారు. కాగా ఈ ప్రతిపాదనలను పరిశీలిస్తామని నిఖిల్‌ కామత్‌ మంత్రి లోకేశ్‌కు హామీ ఇచ్చినట్టు సమాచారం.

Next Story