- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
టూరిస్ట్ ఏసీ రిమోట్ సమస్య తీర్చిన AI
ఒక అమెరికన్ టూరిస్ట్ జపాన్ పర్యటనలో ఎదుర్కొన్న ఇబ్బందిని AI సాయంతో పరిష్కరించుకున్న తీరు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

దిశ, వెబ్ డెస్క్ : విదేశీ ప్రయాణాల్లో భాషా సమస్యలు ఎదురైనప్పుడు AI ఏ విధంగా అండగా నిలుస్తుందో నిరూపించే ఒక ఆసక్తికర ఘటన జపాన్‌లో వెలుగుచూసింది. ఒక అమెరికన్ టూరిస్ట్ జపాన్ పర్యటనలో ఎదుర్కొన్న ఇబ్బందిని AI సాయంతో చిటికెలో పరిష్కరించుకున్న తీరు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఏం జరిగిందంటే?
జపాన్‌కు వెళ్లిన ఓ అమెరికన్ టూరిస్ట్ ఒక హోటల్ గదిలో బస చేశాడు. తెల్లవారుజామున గదిలో విపరీతమైన ఉక్కపోతగా అనిపించడంతో నిద్రలేచి, ఏసీ టెంపరేచర్ తగ్గించాలని రిమోట్ చూసి అవాక్కయ్యాడు. ఆ రిమోట్ పైన ఉన్న బటన్లన్నీ జపనీస్ భాషలో ఉన్నాయి. జపనీస్ భాష తెలియకపోవడంతో ఏ బటన్ దేనికి పని చేస్తుందో అర్థంకాక, ఆ సమయంలో ఎవరిని అడగాలో తెలియక, చివరికి గూగుల్ AI "నానో బనానా " సాయం కోరాడు. రిమోట్‌ను స్కాన్ చేసి, ఆ ఫొటోను AIకి పంపి, కేవలం జపనీస్ అక్షరాలను ఇంగ్లీష్ లోకి ట్రాన్స్లేట్ చేసి ఇవ్వమని కోరాడు. AI ఆ ఫొటోను విశ్లేషించి, రిమోట్‌లోని టెంపరేచర్ కంట్రోల్, ఫ్యాన్ స్పీడ్, మోడ్ సెట్టింగ్స్, టైమర్ బటన్లను యూజర్ కోరినట్టు జపనీస్ నుంచి ఇంగ్లీష్ భాషలోకి మార్చిన రిమోట్ ఇమేజ్‌ను క్షణాల్లో రూపొందించి ఇచ్చింది. ఆ ఫొటో ఆధారంగా ఏసీ సెట్టింగ్‌లను సులభంగా అడ్జస్ట్ చేసుకొని, ప్రశాంతంగా నిద్రపోయాడు. మరుసటి రోజు తన అనుభవాన్ని ఆ ట్రావెలర్ సోషల్ మీడియాలో షేర్ చేయడంతో నెటిజన్ల నుండి విశేష స్పందన లభిస్తోంది.






