AP High Court: హైకోర్టు నూతన జడ్జిలు ప్రమాణ స్వీకారం

by Chukka Sudharani |   (  Updated:2022-08-04 12:43:13  IST  )

7 Judges Take Oath As the Judges of AP High Court| ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో నూతనంగా నియమితులైన ఏడుగురు న్యాయమూర్తులు గురువారం ప్రమాణ స్వీకారం చేశారు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో గవర్నర్ బీబీ హరిచందన్ ప్రమాణ స్వీకారం చేయించారు

7 Judges Take Oath As the Judges of AP High Court
X

దిశ, ఏపీ బ్యూరో : 7 Judges Take Oath As the Judges of AP High Court| ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో నూతనంగా నియమితులైన ఏడుగురు న్యాయమూర్తులు గురువారం ప్రమాణ స్వీకారం చేశారు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో గవర్నర్ బీబీ హరిచందన్ ప్రమాణ స్వీకారం చేయించారు. ప్రమాణ స్వీకారం చేసిన వారిలో ఏవీ రవీంద్రబాబు, డాక్టర్‌ వక్కలగడ్డ రాధాకృష్ణ సాగర్, బండారు శ్యాం సుందర్, ఊటుకూరు శ్రీనివాస్, బొప్పన వెంకట లక్ష్మీ నరసింహ చక్రవర్తి, తాళ్లప్రగడ మల్లికార్జునరావు, దుప్పల వెంకటరమణలు ఉన్నారు. ఇకపోతే న్యాయమూర్తుల ప్రమాణ స్వీకార విషయంలో గవర్నర్‌ తన అధికారాలను హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి బదలాయిస్తారు. దీంతో కొత్త న్యాయమూర్తులతో ప్రధాన న్యాయమూర్తి ప్రమాణం చేయించడం ఆనవాయితీగా వస్తుంది. అయితే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ప్రశాంత్‌ కుమార్‌ మిశ్రాకు మాతృవియోగం కలగడంతో సెలవులో ఉన్నారు. దీంతో గవర్నర్‌ బీబీ హరిచందన్ నూతనంగా నియమితులైన ఏడుగురు న్యాయమూర్తులతో ప్రమాణ స్వీకారం చేయించారు.

ఇది కూడా చదవండి: హైకోర్టు తరలింపుపై ప్రతిపాదన పెండింగ్‌లో లేదు మంత్రి కిరణ్ రిజిజు

Next Story