- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
8 ఏళ్లు బాలీవుడ్‌లో వివక్షను ఎదుర్కొన్నా: AR రెహమాన్ సంచలన వ్యాఖ్యలు
బాలీవుడ్ ఇండస్ట్రీపై ప్రముఖ దిగ్గజ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ తీవ్ర విమర్శలు చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: బాలీవుడ్(Bollywood) ఇండస్ట్రీపై ప్రముఖ దిగ్గజ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్(AR Rahman) తీవ్ర విమర్శలు చేశారు. ‘ఎనిమిది సంవత్సరాలుగా నన్ను బాలీవుడ్ వెలివేసింది. హిందీ ఫీల్డ్‌లో క్రియేటివిటీ పర్సంటేజీ చాలా తక్కువ. అందుకే నన్ను చాలా ఏళ్లు దూరం పెట్టారు. మతపరమైన అంశం కూడా నాపై వివక్ష చూపేందుకు కారణం అయి ఉండొచ్చని అనుకుంటున్నాను. అయినా అవకాశాల కోసం ఒకరి దగ్గర ఏనాడూ వేడుకోలేదు. పని కోసం నా దగ్గరకే వచ్చేలా చేసుకుంటాను. వృత్తిపట్ల నాకు ఉన్న నిబద్ధతే అవకాశాలు తెచ్చి పెడుతుందని భావిస్తాను’ అని తాజాగా ఏఆర్ రెహమాన్ ఓ ఇంటర్వ్యూలో ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇదిలా ఉంటే.. ఏఆర్ రెహమాన్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఈ వ్యాఖ్యలపై తాజాగా విశ్వహిందూ పరిషత్ (VHP) తీవ్రంగా స్పందించింది. రెహమాన్ తిరిగి హిందూ మతంలోకి మారితే మంచిదని వీహెచ్‌పీ జాతీయ అధికార ప్రతినిధి వినోద్ బన్సల్ వ్యాఖ్యానించారు. మరోవైపు, రెహమాన్ వ్యాఖ్యలతో సినీ పరిశ్రమలోని కొందరు విభేదించారు. ప్రముఖ రచయిత జావేద్ అక్తర్ స్పందిస్తూ.. హిందీ పరిశ్రమలో మతపరమైన వివక్ష లేదని, దిలీప్ కుమార్ (యూసుఫ్ ఖాన్), షారుఖ్ ఖాన్ వంటి ఎందరో కళాకారులు అగ్రస్థానంలో ఉన్నారని గుర్తుచేశారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలతో హిందీ చిత్ర పరిశ్రమలో కొత్త చర్చ మొదలైంది.






