మూసీ జన్ ఆందోళన్ ఉద్యమం

by Muthe.Rajitha |

మూసీ పరివాహాక ప్రాంత ప్రజల హక్కుల పరిరక్షణ కోసమే మూసీ జన్ ఆందోళన్ ఉద్యమం చేపట్టినట్టు పౌర, ప్రజాసంఘాల నేతలు మీడియాకు వెల్లడించారు.

మూసీ జన్ ఆందోళన్ ఉద్యమం
X

దిశ, తెలంగాణ బ్యూరో : మూసీ, నది ఒడ్డున నివసించే ప్రజా సమూహాల హక్కులను పరిరక్షించడానికి స్వతంత్ర ప్రజా ఉద్యమం మూసీ జన్ ఆందోళన్ కృషి చేస్తోందని పలువురు పౌర, ప్రజా, పర్యావరణ సంఘాల నేతలు వెల్లడించారు. తెలంగాణ ప్రభుత్వం మూసి నదీ తీర అభివృద్ధి ప్రాజెక్టు పేరుతో వ్యవహరిస్తున్న ఏకపక్ష, నిర్లక్ష్య విధానాన్ని వ్యతిరేకిస్తున్నామని తెలిపారు. సోమవారం హైదరాబాద్ ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో పౌర సమాజ కార్యకర్తలు, పర్యావరణవేత్తలు, మానవ హక్కుల సంఘాలు, మూసీ ఒడ్డున నివసించే మంచిరేవుల, గంధంగూడ, హైదర్ గుడ, బండ్లగూడ గ్రామాల నివాసితులు మాట్లాడారు. ఈ సందర్భగా వారు మాట్లాడుతూ నది సరిహద్దు, బఫర్ జోన్లకు సంబంధించిన మ్యాప్లకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం పూర్తి గోప్యతను పాటిస్తోందని తెలిపారు. నది, దాని బఫర్ జోన్, మూసీ నది తీర అభివృద్ధి ప్రాజెక్ట్ ద్వారా ప్రభావితమయ్యే నిర్మాణాలను గుర్తించడానికి మ్యాప్ లు అందుబాటులేవని అన్నారు. ఈ ప్రాజెక్ట్ నిజమైన ఉద్దేశ్యం ప్రజా ప్రయోజనాలు, మూసీ నది పరీవాహక ప్రాంత పర్యావరణ శ్రేయస్సును పెంపొందించడం కాదని అన్నారు.

ఇది ఒక మెగా రియల్ ఎస్టేట్ మౌలిక సదుపాయాల వెంచర్ అని, ఇక్కడ రాష్ట్ర ప్రయోజనాలు ప్రైవేట్ పార్టీల ప్రయోజనాలు కోసం నది, దాని పర్యావరణ వ్యవస్థ, ప్రజల జీవితాలను పణంగా పెట్టి లాభాలను ఆర్జించడానికేనని అన్నారు. డీపీఆర్, నది సరిహద్దు మ్యాప్ లు బహిరంగంగా అందుబాటులో లేకుండా, తెలంగాణ ప్రభుత్వం ఏ మాత్రం నిజాయితీ లేని, ప్రజా వ్యతిరేక పద్ధతిలో భూసేకరణ చర్యలను ప్రారంభించిందని విమర్శంచారు. భూసేకరణకు సంబంధించి ప్రకటిస్తున్న టీడీఆర్ లను నిర్ద్వందంగా వ్యతిరేకిస్తున్నామని ప్రకటించారు. మూసీ జన్ ఆందోళన్ నేత సజయ, మానవ హక్కుల వేదిక నాయకులు సయ్యద్ బిలాల్, క్లైమేట్ ఫ్రంట్ తెలంగాణ నాయకులు రుచిత్ ఆశా కమల్, దళిత్ బహుజన్ ఫ్రంట్ నేత జాన్ మైఖేల్, విశాలి (కార్సిర్డ్), మూసీ నదీ ప్రాంత బాధిత కుటుంబాలు పాల్గొన్నాయి.

Next Story