37 - 17.. ఆమె - అతడు.. ఓ అక్రమ సంబంధం

by Muthe.Rajitha |

చిత్తూరు జిల్లాలో ఒక వివాహేతర సంబంధం సమాజాన్ని విస్తు పోయేలా చేసింది.

37 - 17.. ఆమె - అతడు.. ఓ అక్రమ సంబంధం
X

దిశ, వెబ్ డెస్క్ : చిత్తూరు జిల్లాలో ఒక వివాహేతర సంబంధం సమాజాన్ని విస్తు పోయేలా చేసింది. తన కుటుంబం, ఇద్దరు పిల్లల భవిష్యత్తు అన్నీ మరిచిపోయిన ఓ నాలుగు పదుల వివాహిత, మైనర్ బాలుడితో అక్రమ సంబంధం పెట్టుకోవడమే కాకుండా, తన అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్న కుటుంబ సభ్యులను హత్య చేయాలని ప్లాన్ చేయడం సంచలనం రేపింది. పోలీసుల వివరాల ప్రకారం.. చిత్తూరు జిల్లా గిరింపేటకు చెందిన పెళ్ళై హైస్కూల్ చదివే ఇద్దరు పిల్లలున్న 37 ఏళ్ల వివాహిత, అదే గ్రామానికి చెందిన 17 ఏళ్ల మైనర్ బాలుడితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. తరుచూ ఇద్దరూ కలిసి బయటికి వెళ్లడం, ఏకాంతంగా కలవడం చేస్తుండటంతో ఇంట్లో వాళ్లకు తెలిసి పెద్ద గొడవ జరిగింది.

అయితే తమ బంధానికి అడ్డుగా వస్తున్నారని అత్తను, భర్తను ఎలాగైనా తొలగించుకోవాలని పథకం వేసింది. వారిని హత్య చేసేందుకు ఆ మైనర్ బాలున్ని ఉసిగొల్పింది. బుధవారం రాత్రి ఇంట్లో అంతా నిద్రిస్తున్న సమయంలో.. వృద్ధురాలైన అత్తపై మైనర్ బాలుడు దాడికి దిగాడు. ఆమె కళ్ళలో కారం చల్లి, కత్తితో గొంతు కోసే ప్రయత్నం చేసాడు. బాధితురాలు కేకలు వేయడంతో ఇరుగుపొరుగు అక్కడికి చేరుకొని, వృద్ధురాలిని రక్షించి, చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వృద్ధురాలి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. అయితే అక్కడే ఉన్న బాలున్ని అదుపులోకి తీసుకొని, పోలీసులకు అప్పగించారు. పోలీసులు అతన్ని కోర్టులో హాజరుపరచి, జువైనల్ హోంకు తరలించారు.

ఇక ఈ దారుణానికి కారణమైన మహిళ మాత్రం ప్రస్తుతం పరారీలో ఉందని పోలీసులు తెలియజేసారు. ప్రత్యేక బృందాలతో ఆమెను పట్టుకునేందుకు గాలిస్తున్నట్టు తెలిపారు. ఈ ఘటన ఒక కుటుంబాన్ని మాత్రమే కాదు, చుట్టూ ఉన్న సమాజం కూడా షాక్ అయ్యేలా చేసింది. ఒక తల్లి తన పిల్లల భవిష్యత్తును మరిచి, ఒక మైనర్ జీవితాన్ని కూడా ప్రమాదంలోకి నెట్టడం దారుణమని స్థానికులు అంటున్నారు. నిందితురాలిని అరెస్టు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరుతున్నారు.

Next Story