TG: రూ.1000 కోట్ల లోన్ తీసుకోవడానికి గ్రీన్ సిగ్నల్

by Gantepaka Srikanth |

రూ.1000 కోట్ల లోన్ తీసుకోవడానికి అనుమతిస్తూ మున్సిపల్ శాఖ కార్యదర్శి డాక్టర్ టీకే.శ్రీదేవి శనివారం ఉత్తర్వులు జారీచేశారు.

TG: రూ.1000 కోట్ల లోన్ తీసుకోవడానికి గ్రీన్ సిగ్నల్
X

దిశ, తెలంగాణ బ్యూరో: మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో మౌలిక వసతుల ప్రాజెక్టులు చేపట్టడానికి హౌసింగ్ అండ్ అర్బన్ డవలప్ మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్(హడ్కో) నుంచి రూ.1000 కోట్ల లోన్ తీసుకోవడానికి తెలంగాణ అర్బన్ ఫైనాన్స్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ డవలప్ మెంట్ కార్పొరేషన్(టీయూఎఫ్ఐడీసీ)కి అనుమతిస్తూ మున్సిపల్ శాఖ కార్యదర్శి డాక్టర్ టీకే.శ్రీదేవి శనివారం ఉత్తర్వులు జారీచేశారు. అయితే పట్టణ ప్రాంతాల్లో తాగునీటి ప్రాజెక్టులు, అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ ప్రాజెక్టులు, మురుగునీటి ప్రాజెక్టులు, ఇతర ప్రాజెక్టుల కోసం రూ.7వేల కోట్ల లోన్లు తీసుకోవడానికి టీయూఎఫ్ఐడీసీకి ప్రభుత్వం అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. లోన్ రీపేమెంట్ చేయడానికి వడ్డీతో కూడిన నిధులను ప్రభుత్వం బడ్జెట్ లో కేటాయించనున్నది.

Next Story