- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
WPL... RCB పై ముంబై విజయం
by Muthe.Rajitha |
వడోదరలో నేడు జరిగిన WPL మ్యాచ్‌లో బెంగుళూరుపై ముంబై విజయం సాధించింది.

X
దిశ, వెబ్ డెస్క్ : వడోదరలో నేడు జరిగిన WPL మ్యాచ్‌లో బెంగుళూరుపై ముంబై విజయం సాధించింది. RCB చివారిదాకా పోరాడినప్పటికీ ముంబయి అద్భుతమైన ప్రదర్శనతో గెలుపును తన ఖాతాలో వేసుకుంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ముంబయి నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు మాత్రమే కోల్పోయి 199 పరుగులు చేసింది. ఈ ఇన్నింగ్స్‌లో బ్రంట్ అద్భుతంగా ఆడి సెంచరీ సాధించగా, ఓపెనర్ మ్యాథ్యూస్ 56 పరుగులతో అర్ధశతకం చేసి జట్టుకు బలమైన స్కోర్ అందించారు.
200 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్సీబీ జట్టు ముంబయి బౌలర్ల కట్టుదిట్టమైన బౌలింగ్‌కు తట్టుకోలేక 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 184 పరుగులకే పరిమితమైంది. రిచా ఘోష్ ఒంటరిగా 90 పరుగులు చేసి పోరాటం చేసినప్పటికీ, మిగతా బ్యాటర్లు ఆశించిన స్థాయిలో రాణించలేకపోయారు. కాగా ముంబైకి ఇది మూడో విజయం కాగా, RCB కి ఇది వరుసగా రెండో ఓటమి.
Next Story






