ధరణితో ఒరిగిందేమీ లేదు.. సమస్యలు తప్ప: ఎంపీ రేవంత్ రెడ్డి

by Disha Web Desk 13 |
ధరణితో ఒరిగిందేమీ లేదు.. సమస్యలు తప్ప: ఎంపీ రేవంత్ రెడ్డి
X

దిశ ప్రతినిధి, మేడ్చల్: ధరణి ఫోర్టల్ తో కేసీఆర్ కుటుంబానికే మేలు జరిగిందని, సామాన్య ప్రజలకు ఒరిగిందేమీ లేదని టీపీసీసీ అధ్యక్షులు, మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి అన్నారు. మేడ్చల్ జిల్లా కీసర మండలం లోని బాల వికాస ఇంటర్నేషనల్ కేంద్రం లో ఏర్పాటు చేసిన మూడు రోజుల శిక్షణా శిబిరంలో సోమవారం చివరి రోజు రేవంత్ రెడ్డి పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ఈ నెల 14వ తేదీ నుంచి మీనాక్షి నటరాజన్ చేపట్టనున్న పాదయాత్ర ను విజయవంతం చేయాలని కాంగ్రెస్ శ్రేణులకు పిలుపునిచ్చారు.


భారతదేశంలో ప్రస్తుతం నడుస్తున్న పంచాయతీ రాజ్, రెవెన్యూ, కాన్స్టిట్యూషన్ విధానాలపై ఈ నెల 14 నుంచి భూదాన్ పోచంపల్లి గ్రామం నుండి భూదాన్ ఉద్యమ స్ఫూర్తి ప్రదాత, భారతరత్న, ఆచార్య వినోబా భావే గారి స్వగ్రామం వరకు పాదయాత్ర చేస్తున్నందున కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంస్థలు పాల్గొనాలని సూచించారు. పాదయాత్రలో దారిపొడవునా గ్రామాల్లో నెలకొన్న రెవెన్యూ సమస్యలు, పంచాయతీరాజ్ వ్యవస్థలను నీరుగారుస్తున్న పాలకుల నిర్లక్ష్య ధోరణిని తెలుసుకుని, ప్రజలకు తెలియజేయాలన్నారు.

కేంద్ర ప్రభుత్వం తీసుకు వచ్చిన రైతు వ్యతిరేక చట్టాల వల్ల ఎంతో మంది రైతులకు అన్యాయం జరుగుతుందన్నారు. కాంగ్రెస్ పార్టీ తీసుకు వచ్చిన భూసేకరణ చట్టాన్ని ప్రస్తుత పాలకులు పట్టించుకోవడం లేదన్నారు. రాష్ట్రంలో ధరణీ వచ్చినప్పటినుండి రైతులకు ఎన్నో సమస్యలు సృష్టించి ప్రభుత్వమే నిర్లక్ష్యంగా వ్యవహరించి రైతుల మధ్య తగాదాలను సృష్టిస్తుందని పేర్కొన్నారు. పెట్టుబడిదారులకు, భూస్వామ్యుల కోసమే కేసీఆర్ ధరణి పోర్టల్ తీసుకువచ్చారని మండిపడ్డారు.

ఈ పాదయాత్ర లో రైతులు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, దళితులు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించాలని, వాటిని పరిష్కరించడం కోసం కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్, మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నంది కంటి శ్రీధర్, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు గోగుల సరిత వెంకటేష్, జడ్పీ ఫ్లోర్ లీడర్ సింగిరెడ్డి హరి వర్ధన్ రెడ్డి, మేడ్చల్ నియోజకవర్గ కోఆర్డినేటర్ తోటకూర జంగయ్య యాదవ్, తెలంగాణ ప్రదేశ్ పంచాయతీ రాజ్ ఈ సంఘటన నాయకులు సిద్దేశ్వర్, రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షులు శివసేన రెడ్డి, మేడ్చల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ బి బ్లాక్ అధ్యక్షులు వేముల మహేష్ గౌడ్, యువజన కాంగ్రెస్ అధ్యక్షులు శ్రవణ్ కుమార్ రెడ్డి, నియోజకవర్గ యువజన కాంగ్రెస్ అధ్యక్షులు కొత్త సుశాంత్ గౌడ్, ఉప్పల్ నియోజకవర్గ నాయకులు సింగిరెడ్డి సోమశేఖర్ రెడ్డి, కీసర మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కోల కృష్ణ యాదవ్, టీపిసిసి మహిళా కార్యదర్శి అనిత, పద్మ తదితరులు పాల్గొన్నారు.


Next Story

Most Viewed