- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

X
దిశ, వికారాబాద్: తెలంగాణ రాష్ట్ర పర్యటనకు వచ్చిన కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విన్ వైష్ణవ్ ను చేవెళ్ల లోక్ సభ సభ్యులు డా. జి. రంజిత్ రెడ్డి శంషాబాద్ విమానాశ్రయంలో శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో, చేవెళ్ల లోక్ సభ నియోజకవర్గ పరిధిలో ఉన్న రైల్వే పెండింగ్ సమస్యలపై ప్రత్యేకంగా చర్చించి, తగు చర్యలు తీసుకోవాలని కోరారు. అందుకు మంత్రి అశ్విన్ వైష్ణవ్ సానుకూలంగా స్పందించారని ఎంపీ రంజిత్ రెడ్డి తెలిపారు.
Next Story






