కన్నతల్లి కర్కశం.. నిద్రమాత్రలిచ్చి కూతురిపై ప్రియునితో అత్యాచారం

by Muthe.Rajitha |

ఓ తల్లి వావివరుసలు మరచి తన సొంత కూతురిపై ప్రియునితో అత్యాచారం జరిపించిన ఘటన చెన్నైలో చోటు చేసుకుంది.

కన్నతల్లి కర్కశం.. నిద్రమాత్రలిచ్చి కూతురిపై ప్రియునితో అత్యాచారం
X

దిశ, వెబ్ డెస్క్ : కంటికి రెప్పలా కాపాడాల్సిన ఓ తల్లి కర్కశత్వానికి పాల్పడింది. వివాహేతర సంబంధం తప్పని చెప్పిన కూతురిపై నిద్ర మాత్రలిచ్చి మరీ ప్రియునితో అత్యాచారం చేయించింది. చెన్నైలోని సాలిగ్రామంలో జరిగిన ఈ దారుణ ఘటన సమాజాన్ని కలచి వేసింది. పోలీసుల వివరాల ప్రకారం.. చెన్నై నగర శివార్లలోని సాలిగ్రామానికి చెందిన ఓ వ్యక్తి.. నగరంలో సెక్యూరిటీ గార్డుగా విధులు నిర్వహిస్తూ.. వారానికి ఒక్కసారి ఇంటికి వచ్చి భార్యను, కూతురుని చూసి వెళుతుండేవాడు. అతని భార్య మరొకరితో వివాహేతర బంధం పెట్టుకోవడంతో తప్పని చెప్పిన కూతురు.. ఆ తరువాత తల్లితో మాట్లాడటం మానేసింది. అయితే ఇరవై రోజులక్రితం ఆ బాలికకు జ్వరం రాగా.. జ్వరం మాత్రలని చెప్పి నిద్రమాత్రలిచ్చి తన ప్రియునితో సొంత కూతురు మీదనే అత్యాచారం చేయించింది. కాగా ఇటీవల రెండు రోజుల క్రితం కూడా అలాగే నిద్రమాత్రలిచ్చి అత్యాచారానికి పాల్పడుతుండగా.. మెలకువ వచ్చిన బాలిక గట్టిగా కేకలు వేసి, తప్పించుకొని పారిపోయింది.

నేరుగా బంధువుల ఇంటికి చేరుకొని జరిగిన అఘాయిత్యాన్ని వారికి చెప్పి భోరున విలపించింది. అయితే తీవ్రమైన కడుపునొప్పి వస్తుండటంతో ఆసుపత్రికి తరలించగా అప్పటికే బాలిక కడుపుతో ఉందని వైద్యులు తేల్చారు. సమాచారం అందుకున్న పోలీసులు.. తల్లిని, ఆమె ప్రియున్ని అరెస్ట్ చేశారు. పోక్సో (Protection of Children from Sexual Offences) చట్టం సహా ఇతర సంబంధిత సెక్షన్ల కింద నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఒక తల్లి తన సొంత కూతురిపై ఇలాంటి దారుణానికి ఒడిగట్టడం సంచలనం రేపింది. నిందితులకు కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని ప్రజలు పోలీసులను డిమాండ్ చేస్తున్నారు.

Next Story