కొడుక్కి విషం పెట్టి తల్లి సూసైడ్.. విషయం తెలిసి అమ్మమ్మ కూడా..

by Gantepaka Srikanth |

హైదరాబాద్‌లోని మీర్‌పేట్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది.

కొడుక్కి విషం పెట్టి తల్లి సూసైడ్.. విషయం తెలిసి అమ్మమ్మ కూడా..
X

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌(Hyderabad)లోని మీర్‌పేట్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. పది నెలల కుమారుడికి విషం పెట్టి.. ఆ తర్వాత ఉరి వేసుకుని తల్లి ఆత్మహత్య చేసుకుంది. కుమార్తె, మనవడి మరణవార్త తెలిసి అమ్మమ్మ ఆత్మహత్యాయత్నం చేసింది. స్థానికుల సమాచారంతో విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి వచ్చి కేసు నమోదు చేసుకున్నారు. దర్యాప్తు ప్రారంభించారు. ఆత్మహత్యకు సంబంధించిన కారణాలు తెలియాల్సి ఉంది. కాగా, ఇటీవల కాలంలో ఈ తరహా ఘటనలు ఎక్కువైపోతున్నాయి. కుటుంబ కలహాలతో కొందరు, ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేక కొందరు.. కుటుంబాలకు కుటుంబాలే ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. పోలీసులు అవగాహనా కార్యక్రమాలు నిర్వహిస్తున్నా.. క్షణికావేశంలో పెద్ద నిర్ణయాలు తీసుకుంటున్నారు.

Next Story