SLBC టన్నెల పనులపై మంత్రి ఉత్తమ్ సమీక్ష

by Gantepaka Srikanth |

ఎస్ఎల్‌బీసీ టన్నెల తవ్వకాల పనులను యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలని నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అధికారులకు సూచించారు.

SLBC టన్నెల పనులపై మంత్రి ఉత్తమ్ సమీక్ష
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఎస్ఎల్‌బీసీ టన్నెల తవ్వకాల పనులను యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలని నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అధికారులకు సూచించారు. ఆదివారం ఎస్ఎల్‌బీసీ పనుల పురోగతిపై సెక్రెటేరియట్‌లో మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. సొరంగం తవ్వడానికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆధునిక పరిజ్ఞానాన్ని ఉపయోగించనున్నట్లు తెలిపారు. తొలగించిన టీబీఎం స్థానంలో అత్యాధునిక పద్ధతిలో టన్నెల్ తవ్వకాలు జరపనున్నట్లు చెప్పారు. మిగిలిన సొరంగ మార్గం 9.8 కిలోమీటర్ల పరిస్థితులపై సమాచారం అందించే ఎలక్ట్రో మాగ్నటిక్ సర్వే పూర్తయినట్టు అధికారులు మంత్రికి వివరించారు. భూగర్భ పరిస్థితులను ఎప్పటికప్పుడు అంచనా వేసే విధంగా సపోర్ట్ సిస్టం కూడా ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు.

పొడవైన సొరంగ మార్గం

ప్రపంచంలోనే అతి పొడవైన సొరంగ మార్గం ఎస్ఎల్‌బీసీని పూర్తిచేయడాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుందని ఉత్తమ్ వివరించారు. సొరంగ మార్గం పనుల్లో క్షేత్ర స్థాయిలో పని చేసే సిబ్బందికి 25 శాతం అదనపు జీతాలు ఉంటాయని తెలిపారు. బీఆర్ఎస్ పదేళ్ల పాలన వల్లే ఎస్ఎల్‌బీసీ పనుల్లో ఆలస్యం జరిగిందన్నారు. ప్రాజెక్టు పూర్తి చేసి నల్గొండను సస్యశ్యామలం చేయడమే కాకుండా, ఫ్లోరోసిస్‌ను శాశ్వతంగా లేకుండా చేస్తామని ప్రకటించారు. ఈ సమావేశంలో ప్రభుత్వ సలహాదారు ఆదిత్యనాథ్‌దాస్, ఇంజినీర్ ఇన్ చీఫ్ అంజద్ హుస్సేన్, లెఫ్టినెంట్ జనరల్ హర్పాల్ సింగ్, ఇంజినీర్లు పాల్గొన్నారు.

Next Story