ఆపరేటింగ్ సిస్టం‌కు ముగింపు పలకనున్న Microsoft.. ఎప్పుడంటే!

by Disha Web Desk 17 |
ఆపరేటింగ్ సిస్టం‌కు ముగింపు పలకనున్న Microsoft.. ఎప్పుడంటే!
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రపంచదిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్ తన ఆపరేటింగ్ సిస్టం Windows 8.1కు త్వరలో ముగింపు పలకనుంది. వచ్చే ఏడాది అనగా 2023 జనవరి 10 తో Windows 8.1కి సపోర్ట్ ఉండదని కంపెనీ పేర్కొంది. వినియోగదారులు సాధారణ భద్రతా అప్‌డేట్‌లు, సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌లు, సాంకేతిక సహాయాన్ని Windows 8.1 వెర్షన్‌పై పొందడం కుదరదని తెలిపింది. Microsoft 365, Office యాప్‌లు మొదలైన అప్‌డేట్‌లు పొందలేరు. ఈ విషయానికి సంబంధించిన నోటిఫికేషన్‌లు వచ్చే నెల జూలై నుంచి వినియోగదారులు పొందుతారని సాఫ్ట్‌వేర్ దిగ్గజం పేర్కొంది. Windows 8 సపోర్ట్‌ జనవరి 12, 2016న ముగిసింది. తరువాత మైక్రోసాఫ్ట్ దాని అప్‌డేట్ వెర్షన్ Windows 8.1ను తీసుకొచ్చింది. ఇప్పుడు దానికి జనవరి 10, 2023న ముగింపు పలకనుంది. Windows 8 వినియోగదారులు ఎలాగైతే Windows 8.1కు అప్‌డేట్ అయ్యరొ అదేవిధంగా ఇప్పుడు Windows 8.1 నుంచి Windows 10 లేదా కొత్తగా వచ్చిన Windows 11కి మారాలని Microsoft వినియోగదారులను కోరుతోంది. అక్టోబర్ 14, 2025 వరకు Windows 10 కి సపోర్ట్ కొనసాగుతుందని కంపెనీ తెలిపింది.


Next Story

Most Viewed