- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఏపీకి వడగాల్పుల హెచ్చరిక.. 3 రోజుల పాటు నిప్పుల కొలిమిలా మారనున్న రాష్ట్రం
ఏపీలో ఎండలు తీవ్రరూపం దాల్చాయి. రాగల 3 రోజులు వడగాలులు వీస్తాయని, ఉష్ణోగ్రతలు 47 డిగ్రీలకు చేరతాయని IMD హెచ్చరించింది.

దిశ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్‌లో గత వారం రోజులుగా వింత వాతావరణం ఏర్పడుతుంది. ఓ పక్క ఎండలు దంచి కొడుతుండగా, మరోవైపు అకాల వర్షాలు రైతులను, సామాన్యులను ఆగమాగం చేస్తున్నాయి. ముఖ్యంగా రాష్ట్రంలో ఎండల తీవ్రత ప్రమాదకర స్థాయికి చేరింది. రాష్ట్రంలో రాగల మూడు రోజుల పాటు తీవ్ర వడగాలులు (Heat Waves) వీస్తాయని భారత వాతావరణ శాఖ (IMD) హెచ్చరించింది. నేడు రాష్ట్ర వ్యాప్తంగా 29 మండలాల్లో తీవ్ర వడగాలులు, మరో 166 మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది.
ఃపలు ప్రాంతాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 45 నుంచి 47 డిగ్రీల వరకు నమోదయ్యే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలో ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ముఖ్యంగా మధ్యాహ్నం 11 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు అత్యవసరమైతే తప్ప వృద్ధులు, గర్భిణీలు, చిన్నారులు బయటకు రావొద్దని హెచ్చరించారు. డీహైడ్రేషన్ బారిన పడకుండా ఉండటానికి తగినన్ని నీళ్లు, మజ్జిగ, ఓఆర్‌ఎస్ (ORS) ద్రావణం తీసుకోవాలని స్పష్టం చేశారు.






