- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Megastar Chiranjeevi : సంక్రాంతి సెంటిమెంట్.. చిరంజీవి స్పెషాలిటీ ఇదే!
మూడేళ్ల విరాతం తర్వాత సంక్రాంతికి సినిమాతో వస్తున్నారు మెగాస్టార్ చిరంజీవి.

దిశ, వెబ్‌డెస్క్: మూడేళ్ల విరాతం తర్వాత సంక్రాంతికి సినిమాతో వస్తున్నారు మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi). చివరగా 2023లో వాల్తేరు వీరయ్యతో వచ్చిన మెగాస్టార్.. బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టారు. ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం దాదాపు రూ.220 కోట్లకు పైగానే కలెక్షన్లు సాధించింది. ప్రస్తుతం మరోసారి సంక్రాంతి పండక్కి చిరంజీవి సినిమాతో వస్తుండటంతో అభిమానుల్లో అంచనాలు పెరిగిపోయాయి. ఇందులో మరో అగ్రహీరో విక్టరీ వెంకటేశ్ అతిథి పాత్రలో నటిస్తుండటంతో మరింత బజ్ ఏర్పడింది. హిట్ దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ భారీ చిత్రంలో నయనతార కథానాయికగా నటిస్తోంది. ఈ చిత్రం నుంచి ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్‌తో పాటు పాటలు కూడా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఇదిలా ఉంటే.. గతంలోనూ అనేక సినిమాలు సంక్రాంతి వేళ విడుదలై పెద్ద హిట్లు సాధించాయి. ఆ సినిమాల వివరాలు కింద పేర్కొనడం జరిగింది.
చిరంజీవి సంక్రాంతి సినిమాలు..
1985 - చట్టంతో పోరాటం
1987 - దొంగ మొగుడు
1988 - మంచి దొంగ
1989 - అత్తకు యుముడు అమ్మాయికి మొగుడు
1993 - ముఠా మేస్త్రి
1994 - ముగ్గురు మొనగాళ్లు
1997 - హిట్లర్
1999 - స్నేహం కోసం
2000 - అన్నయ్య
2004 - అంజి
2017 - ఖైదీ నెంబర్ 150
2023 - వాల్తేర్ వీరయ్య
2026= మనశంకరవరప్రసాద్ గారు(విడుదల కావాల్సి ఉంది)






