కంటైనర్ మీద పడి వ్యక్తి మృతి

by Batti.Sumithra |

అజాగ్రత్తగా కంటైనర్ నడపడంతో అదుపుతప్పి విద్యుత్ స్తంభాన్ని ఢీ కొట్టి నిద్రిస్తున్న వ్యక్తి పై పడడంతో మృతి చెందిన సంఘటన వేములపల్లి మండలం బుగ్గ బావి గూడెం గ్రామంలో సోమవారం తెల్లవారుజామున జరిగింది.

కంటైనర్ మీద పడి వ్యక్తి మృతి
X

దిశ, వేములపల్లి : అజాగ్రత్తగా కంటైనర్ నడపడంతో అదుపుతప్పి విద్యుత్ స్తంభాన్ని ఢీ కొట్టి నిద్రిస్తున్న వ్యక్తి పై పడడంతో మృతి చెందిన సంఘటన వేములపల్లి మండలం బుగ్గ బావి గూడెం గ్రామంలో సోమవారం తెల్లవారుజామున జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన పోలేబోయిన వెంకటయ్య (49) ఇంటి ముందు నిద్రిస్తుండగా నల్గొండ నుండి మిర్యాలగూడ వైపు వస్తున్న కంటైనర్ అదుపుతప్పి సమీపంలోని విద్యుత్ స్తంభాన్ని ఢీ కొట్టింది. దీంతో ఒక్కసారిగా కంటైనర్ ఎగిరి నిద్రిస్తున్న వెంకటయ్య పై పడటంతో అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం తెలుసుకొని సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వెంకటేశ్వర్లు తెలిపారు.

Next Story