- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సుప్రీంకోర్టులో మమతకు ఎదురు దెబ్బ
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియకు సంబంధించి TMC పార్టీకి సుప్రీంకోర్టులో భారీ ఎదురుదెబ్బ తగిలింది.

దిశ, వెబ్ డెస్క్ : పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియకు సంబంధించి అధికార తృణమూల్ కాంగ్రెస్ (TMC) పార్టీకి సుప్రీం కోర్టులో భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఓట్ల లెక్కింపులో సూపర్‌వైజర్లు మరియు అసిస్టెంట్లుగా కేవలం కేంద్ర ప్రభుత్వ మరియు పీఎస్‌యూ (PSU) ఉద్యోగులను మాత్రమే నియమించాలన్న ఎన్నికల సంఘం (ECI) ఆదేశాలను సవాలు చేస్తూ టీఎంసీ దాఖలు చేసిన పిటిషన్‌ను అత్యున్నత న్యాయస్థానం తిరస్కరించింది. మే 2వ తేదీ శనివారం ఉదయం జస్టిస్ పి.ఎస్. నరసింహ మరియు జస్టిస్ జోయమల్య బాగ్చీలతో కూడిన స్పెషల్ బెంచ్ ఈ కేసును విచారించి, కలకత్తా హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించింది.
రాజకీయ పార్టీల అనుమతి అవసరం లేదు : సుప్రీం
ఓట్ల లెక్కింపు ప్రక్రియలో కేవలం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులను మాత్రమే నియమించడం వల్ల అది పక్షపాతానికి దారితీస్తుందని, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులను కూడా ఈ ప్రక్రియలో చేర్చాలని టీఎంసీ గట్టిగా వాదించింది. అయితే, కౌంటింగ్‌లో మైక్రో అబ్జర్వర్లుగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎందుకు ఉండకూడదన్న సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ప్రభుత్వ ఉద్యోగులు విధుల్లో భాగంగానే పనిచేస్తారు.. వారికి ఎలాంటి విధేయతలు ఉండవని స్పష్టం చేసింది. ఎన్నికల నిర్వహణ మరియు సిబ్బంది నియామకం విషయంలో స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకునే అధికారం ఎన్నికల సంఘానికి ఉంటుందని, దీనిలో ఎలాంటి చట్టపరమైన నిబంధనల ఉల్లంఘన లేదని పేర్కొంది. సిబ్బంది నియామకంపై ఈసీ రాజకీయ పార్టీలను సంప్రదించాల్సిన అవసరం లేదని ధర్మాసనం తేల్చి చెప్పింది. మే 4వ తేదీన ఓట్ల లెక్కింపు జరగనున్న తరుణంలో, ఈ అత్యవసర తీర్పు మమతా బెనర్జీకి భారీ సెట్‌బ్యాక్‌గా పరిగణించబడుతోంది.






