- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Malaysia Open: మలేసియా ఓపెన్.. ముగిసిన పీవీ సింధు పోరాటం
by Kema Shiva Kumar |
మలేసియా ఓపెన్ (Malaysia Open)లో భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు (PV Sindhu) పరాజయం పాలైంది.

X
దిశ, వెబ్‌డెస్క్: మలేసియా ఓపెన్ (Malaysia Open)లో భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు (PV Sindhu) పరాజయం పాలైంది. ఇవాళ జరిగిన మహిళల సింగిల్స్ సెమీఫైనల్ పోరులో ప్రపంచ నంబర్ 2 చైనా క్రీడాకారిణి వాంగ్ జి యి (Wang Ji Yi) చేతిలో సింధు 16-21, 15-21 స్కోరుతో వరుస సెట్లలో ఓడారు. దాదాపు 47 నిమిషాల పాటు సాగిన ఈ మ్యాచ్‌లో సింధు ఆరంభం నుంచి ప్రత్యర్థికి గట్టి పోటీ ఇచ్చారు. అయితే, తొలి సెట్‌లో ఒక దశలో స్కోర్లు సమంగా ఉన్నప్పటికీ, వాంగ్ జి యి తన వేగవంతమైన స్మాష్‌లతో పైచేయి సాధించి 21-16తో సెట్‌ను కైవసం చేసుకున్నారు. రెండో సెట్‌లో పుంజుకోవడానికి సింధు ప్రయత్నించినప్పటికీ, చైనా షట్లర్ పటిష్టమైన డిఫెన్స్‌ను చేధించలేక 21-15తో రెండో సెట్‌ను కూడా కోల్పోయి టోర్నీ నుంచి నిష్క్రమించారు.
Next Story






