- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
శ్రీశైలంలో మకర సంక్రాంతి బ్రహ్మోత్సవాలు షురూ.. కాసేపట్లో వైభవోపేతంగా ధ్వజారోహణ
ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటైన శ్రీశైల మహాక్షేత్రంలో మకర సంక్రాంతి బ్రహ్మోత్సవాలు ఇవాళ అట్టహాసంగా ప్రారంభమయ్యాయి.

దిశ, వెబ్‌డెస్క్: ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటైన శ్రీశైల (Srisailam) మహాక్షేత్రంలో మకర సంక్రాంతి బ్రహ్మోత్సవాలు ఇవాళ అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. పంచాహ్నిక దీక్షతో ఏడు రోజుల పాటు నిర్వహించే ఈ ఉత్సవాల కోసం దేవస్థానం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇవాళ ఉదయం 9 గంటలకు స్వామి వారి యాగశాల ప్రవేశంతో బ్రహ్మోత్సవాలు శాస్త్రోక్తంగా మొదలయ్యాయి. సాయంత్రం ముక్కోటి దేవతలను ఆహ్వానిస్తూ ధ్వజారోహణ , ధ్వజ పటావిష్కరణ క్రతువును నిర్వహించనున్నారు.
వాహన సేవలు ఇలా..
జనవరి 13న భృంగి వాహన సేవ, జనవరి 14న కైలాస వాహన సేవ, జనవరి 15 సంక్రాంతి పర్వదినాన నంది వాహన సేవ, పార్వతీ పరమేశ్వరుల బ్రహ్మోత్సవ కళ్యాణాన్ని నిర్వహించానున్నారు. అదేవిధంగా జనవరి 16న రావణ వాహన సేవ, జనవరి 17న యాగ పూర్ణాహుతి, త్రిశూల స్నానం, ధ్వజావరోహణ, జనవరి 18: అశ్వ వాహన సేవ, పుష్పోత్సవం, శయనోత్సవంతో బ్రహ్మోత్సవాలు పరిసమాప్తం అవుతాయి.
భక్తులకు ప్రత్యేక ఏర్పాట్లు..
మకర సంక్రాంతి బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తుల రద్దీని దృష్ట్యా ఆలయ ఈవో శ్రీనివాస రావు పర్యవేక్షణలో అధికారులు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేశారు. క్యూ లైన్లలో భక్తులకు ఇబ్బంది కలగకుండా నిరంతర తాగునీరు, పాలు పంపిణీ చేయనున్నారు. భక్తుల కోసం వసతి గదులు, అన్నప్రసాద వితరణ ఏర్పాట్లు కూడా చేశారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా ఈనెల 12 నుంచి 18 వరకు పలు ఆర్జిత సేవలను తాత్కాలికంగా నిలిపివేశారు.






