శ్రీనగర్‌లో భారీ అగ్ని ప్రమాదం.. దాల్ లేక్ తీరంలోని ఓ హోటల్‌లో ఘటన

by Kema Shiva Kumar |

జమ్ముకశ్మీర్‌లోని ప్రముఖ పర్యాటక కేంద్రం దాల్ లేక్ తీరంలో శనివారం భారీ అగ్ని ప్రమాదం సంభవించింది.

శ్రీనగర్‌లో భారీ అగ్ని ప్రమాదం.. దాల్ లేక్ తీరంలోని ఓ హోటల్‌లో ఘటన
X

దిశ, వెబ్‌డెస్క్: జమ్ముకశ్మీర్‌ (Jammu Kashmir)లోని ప్రముఖ పర్యాటక కేంద్రం దాల్ లేక్ (Dal Lake) తీరంలో శనివారం భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. సరస్సు ఒడ్డున ఉన్న ఒక హోటల్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో స్థానికులు, పర్యాటకులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. వాటర్ అంబులెన్స్‌తో సహాయక చర్యలు ప్రమాద సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగారు. హోటల్ సరస్సు తీరానికి ఆనుకుని ఉండటంతో, మంటలను అదుపు చేసేందుకు అగ్నిమాపక వాహనాలతో పాటు వాటర్ అంబులెన్స్‌ను కూడా వినియోగించారు. నీటిపై నుంచి మంటలపై నీటిని చిమ్ముతూ సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఈ మేరకు ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. షార్ట్ సర్క్యూట్ వల్ల ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చని ప్రాథమికంగా అనుమానిస్తున్నారు.

Next Story