అత్యధిక లాభాల కంపెనీల్లో LIC టాప్

by Muthe.Rajitha |

భారత ప్రభుత్వరంగ బీమా దిగ్గజం లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (LIC) సరికొత్త చరిత్ర సృష్టించింది.

అత్యధిక లాభాల కంపెనీల్లో LIC టాప్
X

దిశ, వెబ్ డెస్క్ : భారత ప్రభుత్వరంగ బీమా దిగ్గజం లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (LIC) సరికొత్త చరిత్ర సృష్టించింది. మార్చితో ముగిసిన 2025-26 ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికం (Q4) లో ఎల్‌ఐసీ ఏకంగా రూ.23,420 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. గత ఏడాది ఇదే త్రైమాసికంలో నమోదైన రూ.19,013 కోట్ల లాభంతో పోలిస్తే ఇది 23 శాతం వృద్ధి కావడం గమనార్హం. ఈ అద్భుతమైన ప్రదర్శనతో అటు ప్రభుత్వరంగ సంస్థలలోనే కాకుండా, ఇటు దేశీయ ఫైనాన్షియల్ సెక్టార్‌లోనే త్రైమాసిక ప్రాతిపదికన అత్యధిక లాభాలు గడించిన నంబర్ వన్ కంపెనీగా ఎల్‌ఐసీ అవతరించింది. బ్యాంకింగ్ దిగ్గజాలైన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) రూ.19,684 కోట్లు, హెచ్‌డీఎఫ్‌సీ (HDFC) బ్యాంక్ రూ.19,221 కోట్ల నికర లాభాలతో క్యూ4 రేసులో ఎల్‌ఐసీ తర్వాతి స్థానాల్లో నిలిచాయి.

అయితే, త్రైమాసిక లాభాల్లో ఎల్‌ఐసీ టాప్‌లో నిలిచినప్పటికీ, పూర్తి ఆర్థిక సంవత్సర (FY26) వార్షిక లాభాల పరంగా మాత్రం ఎస్‌బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకులు ఎల్‌ఐసీని అధిగమించాయి. పూర్తి ఏడాదికి ఎల్‌ఐసీ రూ.57,419 కోట్ల నికర లాభాన్ని నమోదు చేయగా.. ఎస్‌బీఐ రూ.80,032 కోట్లు, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ రూ.74,670 కోట్ల వార్షిక లాభాలతో మొదటి రెండు స్థానాలను కైవసం చేసుకున్నాయి.

Next Story