లొట్టపీసు కేసు అయితే కేటీఆర్ ఎందుకు బయపడుతున్నారు? : మంత్రి సీతక్క

by Muthe.Rajitha |

అసెంబ్లీ లాబీల్లో నేడు పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు మీడియాతో నేతల చిట్ చాట్ చేసారు.

లొట్టపీసు కేసు అయితే కేటీఆర్ ఎందుకు బయపడుతున్నారు? : మంత్రి సీతక్క
X

తెలంగాణ బ్యూరో : లొట్టపీసు కేసు అయితే కేటీఆర్ ఎందుకు బయపడుతున్నారు? అని మంత్రి సీతక్క ప్రశ్నించారు. మంగళవారం అసెంబ్లీ లాబీల్లో ఆమె మీడియాతో చిట్ చాట్ చేశారు. తనకోసం అధికారులను వేధించవద్దని కేటీఆర్ కపట ప్రేమ ప్రదర్శిస్తున్నారని, అధికారులపై అంత ప్రేమ ఉంటె రెడ్ బుక్ లో అధికారుల పేరు రాస్తున్నాం, అంతుచూస్తామని అనడం దేనికోసం సీతక్క నిలదీశారు. అధికారులను వాడు వీడు అని కేటీఆర్ మాట్లాడుతున్నారు, అదేమి సంస్కారమని, ఆయనది అంతా మేకపోతు గాంభీర్యమని, ధైర్యంగా కేసును ఎదుర్కోవాలని సీతక్క హితవు పలికారు.

నాకు మంత్రి పదవి ఇస్తే కాంగ్రెస్ కి, రాష్ట్ర ప్రభుత్వానికి మంచిపేరు వస్తుంది : మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

తనకు మంత్రి పదవి ఇస్తే కాంగ్రెస్ పార్టీకి, రాష్ట్ర ప్రభుత్వానికి మంచిపేరు వస్తుందని, కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి రావాలంటే నాలాంటి తెలంగాణ ఉద్యమకారుల సేవలు అవసరమని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్పష్టం చేశారు. మంగళవారం ఆయన అసెంబ్లీ లాబీల్లో మీడియాతో చిట్ చాట్ చేశారు. మంత్రి పదవి ఇస్తామని అధిష్టానం గతంలో హామీ ఇచ్చిందని, అధిష్టానం ఇపుడు ఏం చేస్తుందో తెలియదని రాజగోపాల్ రెడ్డి అభిప్రాయపడ్డారు. తాను మంత్రి పదవి కోసం పాకులాడడం లేదని, ఏ పదవి లేకున్నా రాజగోపాల్ రెడ్డికి ప్రజల్లో తగిన గౌరవం ఉంటుందన్నారు. తనకు రేవంత్ రెడ్డితో ఎలాంటి ఇబ్బంది లేదని, సోమవారం సీఎంతో ప్రత్యేక భేటీ లేదు, ఎదురుపడితే పలకరించుకున్నామని ఆయన తెలిపారు. నేడు కేటీఆర్ తో కూడా సాధారణంగా అన్ని విషయాలపై మాట్లాడానని, 2018 ఎన్నికల్లో 88 సీట్లు వచ్చిన తర్వాత కూడా 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను తీసుకోవడం తప్పని కేటీఆర్ కు చెప్పినట్లుగా రాజగోపాల్ రెడ్డి చెప్పారు.

ఒకే టేబుల్ పై కేటీఆర్, రాజగోపాల్ రెడ్డి, పాయల్ శంకర్ లంచ్...

అసెంబ్లీ డైనింగ్ హాల్ లో ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకున్నది. ఒకే టేబుల్ పైన బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్, రాజగోపాల్ రెడ్డి, బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ లు లంచ్ చేశారు. లంచ్ పూర్తయిన తర్వాత కూడా డైనింగ్ హాల్లోనే దాదాపుగా వారు సుదీర్ఘంగా భేటీ అయ్యారు. దాదాపుగా రెండు గంటల పాటు కేటీఆర్, రాజగోపాల్ రెడ్డి, పాయల్ శంకర్ మాట్లాడుకున్నారు.

ఇప్పపువ్వు సారా పైన పూర్తి అవగాహనా ఉంది : జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుథ్ రెడ్డి

ఇప్పపువ్వు సారాపై సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తున్నారు..తనకు ఇప్పపువ్వు సారా పైన పూర్తి అవగాహనా ఉందని జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుథ్ రెడ్డి చెప్పారు. మంగళవారం ఆయన అసెంబ్లీ లాబీల్లో మీడియాతో చిట్ చాట్ చేశారు. ఇప్పుపువ్వు సారాపైన తాను అవగాహనా లేకుండా మాట్లాడడం లేదని, నేడు అసెంబ్లీలో ఇప్పపువ్వు సారాపై మాట్లాడుతున్నానని, అన్ని వివరాలు వెల్లడిస్తానని అనిరుథ్ రెడ్డి చెప్పారు. ఎవరైతే తనను సోషల్ మీడియా ట్రోల్స్ చేస్తున్నారో వారు అసెంబ్లీలో తన ప్రసంగం వినాలని ఆయన తెలిపారు.

Next Story