మినీ స్టేడియం కోసం యువత పాట్లు

by Dishanational1 |
మినీ స్టేడియం కోసం యువత పాట్లు
X

దిశ, వర్గల్: చిన్నప్పటి నుండే విద్యార్థుల ఇష్టాన్ని అర్థం చేసుకొని వారు ఏ క్రీడల్లో రాణిస్తారో తెలుసుని సరైన శిక్షణ ఇప్పిస్తే ప్రపంచస్థాయి పోటీల్లో ఎవరికైనా పథకాలు సాధించడం సాధ్యమవుతుంది కానీ మండలంలోని అనేక పాఠశాలల్లో ఆడుకునేందుకు మైదానలే ఉండడం లేదు. క్రీడల గురించి పట్టించుకునే పరిస్థితి ఉండడం లేదు. దీంతో జాతీయ, అంతర్జాతీయ క్రీడాకారులు మనకు తయారు కావడం లేదు. పుస్తకాలతో కుస్తీ తప్ప క్రీడల్లో రాణించే పరిస్థితి కనిపించడం లేదు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా పల్లె ప్రకృతిలో క్రీడా మైదానాలను నిర్మించారు. దాని వల్ల విద్యార్థులకు ఎలాంటి ఉపయోగం లేకుండా పోతుంది. వర్గల్ మండల కేంద్రంలో యువకులు చాలా కాలంగా తమకు ప్రభుత్వం నుంచి మినీ స్టేడియం ఏర్పాటు చేయాలని మంత్రి హరీష్ దృష్టికి తీసుకెళ్లారు. అంతలోనే ప్రభుత్వ జూనియర్ కళాశాలలో క్రీడా ప్రాంగణాన్ని ఏర్పాటు చేయడంతో నిరాశ చెందుతున్నారు. ఇప్పటికైనా అధికారులు గ్రామాలలో ప్రభుత్వ స్థలాలను గుర్తించి క్రీడలకు అనువైన స్థలాలలో క్రీడ మైదానాలను ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.


Next Story

Most Viewed