Lara Dutta: అందం కాదు.. ఆ సమాధానమే మిస్ యూనివర్స్‌గా నిలబెట్టింది : లారా దత్తా

by Disha Web Desk 19 |
Lara Dutta: అందం కాదు.. ఆ సమాధానమే మిస్ యూనివర్స్‌గా నిలబెట్టింది : లారా దత్తా
X

దిశ, సినిమా: బాలీవుడ్ నటి నేటితో 44వ వసంతంలోకి అడుగుపెట్టింది. 2000 సంవత్సరంలో మిస్ యూనివర్స్ టైటిల్‌ గెలుచుకున్న ఆమె.. పుట్టినరోజు సందర్భంగా గత అనుభవాలను గుర్తుచేసుకుంది. మిస్ యూనివర్స్ పోటీ సమయంలో తనతోపాటు వెనిజులాకు చెందిన క్లాడియా మోరెనో, స్పెయిన్‌కు చెందిన హెలెన్ లిండెస్‌ల మధ్య ఫైనల్ ఫైట్ రసవత్తరంగా జరిగిందని చెప్పింది.

అయితే విజేతను తేల్చేందుకు చివరి ప్రశ్నగా.. 'ప్రస్తుతం బయట మిస్ యూనివర్స్ పోటీల్లో మహిళలను అగౌరవపరిచారంటూ నిరసన జరుగుతోంది. అది అబద్ధమని వాళ్లను ఎలా ఒప్పించగలరు?' అని నిర్వాహకులు అడిగారని చెప్పిన నటి దీనిపై ఆత్మవిశ్వాసంతో సమాధానమిచ్చినట్లు తెలిపింది. 'మిస్ యూనివర్స్ వంటి పోటీలు యువతులు కోరుకునే రంగాల్లో రాణించడానికి గొప్ప వేదికగా నిలుస్తాయని భావిస్తున్నాను. ఈ పోటీలు అన్ని రంగాలపై తమ అభిప్రాయాల్ని తెలియజేయడానికి, మరింత బలంగా, స్వతంత్రంగా ఉండేందుకు ప్రేరణనిస్తాయి' అని వివరించానని చెప్పుకొచ్చింది. ఇక ఆ సమాధానం న్యాయనిర్ణేతలను ఆకట్టుకోవడం వెంటనే మిస్ యూనివర్స్ కిరీటాన్ని అందించడం జరిగిపోయిందని తెలిపింది.

Next Story

Most Viewed