కడ్తాల్ వెంచర్లలో కల్లోలం.. డీటీసీపీ ఉన్నా.. పాస్ పుస్తకాలు రద్దు కావా?

by Malleboina Mahesh |

కడ్తాల్‌లో నాలా కన్వర్షన్ అయినా వెంచర్లు ఇంకా సాగు భూమిగానే ఉన్నాయి. అధికారుల నిర్లక్ష్యంతో ప్లాట్ల యజమానులు, పంచాయతీ ఆదాయం నష్టపోతున్నారు.

కడ్తాల్ వెంచర్లలో కల్లోలం.. డీటీసీపీ ఉన్నా.. పాస్ పుస్తకాలు రద్దు కావా?
X

దిశ, రంగారెడ్డి బ్యూరో: భూములకు మంచి డిమాండ్‌ ఉన్న ఉన్న రంగారెడ్డి జిల్లా కడ్తాల్‌ గ్రామంలో రెవిన్యూ రికార్డులు అస్తవ్యస్తంగా ఉన్నాయి. నాలా కన్వర్షన్‌ జరిగి డిటిసిపి ఆమోదం పొందిన సర్వే నెం.894లోని ఓ లే అవుట్‌ ఇంకా రికార్డులలో పట్టా భూమిగానే కొనసాగుతోంది. ఈ నిర్లక్ష్యమే ఇప్పుడు ఆ వెంచర్‌‌లో ప్లాట్లు కొనుగోలు చేసిన వారి కొంప ముంచేలా చేస్తుంది. అధికారిక లెక్క ప్రకారం.. కడ్తాల్‌ గ్రామ పంచాయతీలోనే 191 వరకు వెంచర్లు ఉన్నాయి. చాలా వాటిల్లో రెవిన్యూ శాఖ సాగు భూమిగా ఇంకా కొనసాగిస్తూ పట్టా పాస్ పుస్తకాలను రద్దు చేయడం లేదు. భూ భారతి పోర్టల్‌‌లో ఉన్న ఆటో మెటిక్‌ విధానంతో చేతులు మారే ప్రమాదం ఉందని అసలు ప్లాట్ల దారులు ఆందోళన చెందుతున్నారు. అధికారుల తప్పిదంతో కడ్తాల్‌ పంచాయతీకి సైతం గండి పడుతోంది. భారీ స్థాయిలో వెంచర్లు ఉన్న కడ్తాల్‌ గ్రామ పంచాయతీకి 10శాతం రూపేణా వచ్చే భూమితో భవిష్యత్‌ అవసరాల కోసం ల్యాండ్‌ బ్యాంక్‌ నే ఏర్పాటు చేయొచ్చు. కానీ..ఆయా భూములు ఎక్కడెక్కడ ఉన్నాయన్నది! కూడా సందేహాస్పదంగా మారింది.

నాలా కన్వర్షన్‌ అయినా..

కడ్తాల్‌ గ్రామంలోని సర్వే నెం.894లోని 3.15 ఎకరాలు, సర్వే నెం.895లోని 1.25 ఎకరాలు కలిపి మొత్తం 5 ఎకరాలకు నాలా కన్వర్షన్‌ కోసం రావిపాటి వెంకటేశ్వర్‌ రావు అనే రియల్టర్‌ దరఖాస్తు చేసుకున్నారు. ఈ మేరకు 2017 సంవత్సరంలో అప్పటి ఆర్డీవో నాలా కన్వర్షన్‌(ఫైల్‌ నెం. ఎల్‌/589/2017) కు అనుమతులు ఇచ్చారు. సదరు భూమిలో ‘ఫార్మా సిటీ’ పేరుతో చేసిన లే అవుట్‌‌కు డిటిసిపి(ఎల్‌ పి నెం.45/2017/హెచ్‌ఆర్‌ఓ/హెచ్‌) అనుమతులు కూడా ఇచ్చారు. ఇందులో ప్లాట్ల క్రయ విక్రయాలు కూడా జరిగాయి. అయితే రెవెన్యూ, రిజిస్ట్రేషన్‌ శాఖల మధ్య సమన్వయ లోపం కారణంగా నేటికీ ప్లాట్లుగా మార్చిన భూమికి పాస్ పుస్తకం రద్దు కాలేదు. నాలా అనుమతులు ఇచ్చిన వెంటనే ల్యాండ్‌ క్లాసిఫికేషన్‌‌ను సరిగ్గా రికార్డు చేయక పోవడంతో రెవిన్యూ రికార్డులో 5 ఎకరాల వెంచర్‌ భూమి సాగు భూమిగానే ఆన్‌ లైన్‌‌లో కన్పిస్తోంది.

కడ్తాల్‌ లోనే 191 వెంచర్లు..

కడ్తాల్‌ లో ఎకరం భూమి ధర రూ.3కోట్ల నుంచి రూ.5కోట్ల వరకు పలుకుతోంది. రియల్టర్లు ఈ ప్రాంతంలో పెద్ద ఎత్తున వెంచర్లు ఏర్పాటు చేసి వ్యాపారం చేశారు. అనుమతులు తీసుకుని కొన్ని వెంచర్లను ఏర్పాటు చేస్తే.. డిటిసిపి అనుమతులు తీసుకున్న వెంచర్ల కూడా చాలానే ఉన్నాయి. అధికారుల లెక్క ప్రకారం కడ్తాల్‌ గ్రామ పంచాయతీలో డిటిసిపి అనుమతులు పొందిన వెంచర్లు సర్వే నెంబర్లు 872, 8,815, 872, 801, 749, 611, 711, 761, 763, 58, 91, 92, 93, 95, 843, 844, 845, 647, 646, 900, 908, 909, 4, 66, 63, 53, 55, 597, 598, 599, 596, 604, 596, 328, 329, 330, 877, 882, 612, 699, 710, 634, 759, 762, 764, 766, 753, 754, 756, 757, 758, 12, 13, 367, 327, 634, 635, 636, 884, 886, 887, 888, 890, 891, 885, 883, 634, 811, 21, 22, 57, 58, 60, 78, 883, 882, 877, 881, 12, 13, 689, 3, 86, 557, 558, 559/P, 560/P, 628/P, 631/9, 14, 700, 709, 710, 712, 698, 701, 875, 690, 806, 799, 730, 738, 737, 89, 795, 874, 799, 800, 653, 892, 723, 653, 733, 730, 756, 760, 761, 556, 560, 561, 756, 760, 761, 664, 789, 790, 800, 807, 799, 873, 802, 795, 797, 793, 797, 792, 793, 796, 795, 797, 802, 12, 773, 807, 5, 6, 7, 8, 773, 775, 776, 664, 877, 733, 734, 748, 588, 589, 583, 583, 589, 589, 588, 875, 737, 612, 3, 4, 9, 66, 799, 800, 807, 808, 809, 748, 799, 782, 751, 877, 877, 878, 882, 773, 775, 776, 801, 86, 799, 800, 72, 722, 733, 724, 601, 69, 780, 820, 556, 589, 589, 583, 878, 738, 894, 895, 7, 556, 881, 25, 27, 30, 31, 33, 34, 37, 38, 40, 35, 36, 50, 5, 611, 748, 749, 773, 775, 776, 664, 877, 872, 807, 808, 809, 810, 812, 700, 710, 21, 22, 57, 58, 60, 556, 756, 800, 879, 894 లలో 191 వరకు ఉన్నాయి.

10 శాతం ల్యాండ్‌ ఎక్కడ!..

ప్లాట్లను సేల్‌ చేశాక.. పాతిన రాళ్లను తొలగించి, ప్లాట్ల యజమానులకు వారి ప్లాట్లు ఎక్కడ ఉన్నాయో వారికే తెలియకుండా చేశారు. ఇదే క్రమంలో వెంచర్‌ భూములను వ్యవసాయ భూములుగానే రికార్డుల్లో ఉంచి రెండోసారి రియల్టర్లకు ఆ భూములపై హక్కులు కల్పిస్తున్నారు. దీంతో హక్కులు మావేనంటూ స్థానికంగా ఉన్న కొందరి అండదండలతో రియల్టర్లు బెదిరింపులకు పాల్పడుతున్నారు. కొందరు ఎంతో కొంత ముట్టజెప్పి రాజీ చేసుకుంటున్నారు. ఇక్కడ జరుగుతున్న రియల్‌ వ్యాపారంతో అందరూ లాభ పడుతుండగా.. కడ్తాల్‌ గ్రామ పంచాయతీ మాత్రం ఆదాయ పరంగా కుదేలు అవుతోంది.

లే అవుట్‌ సందర్భంగా కడ్తాల్‌ పంచాయతీకి దక్కాల్సిన 10 శాతం ల్యాండ్‌ కూడా పూర్తి స్థాయిలో దక్కడం లేదు. అధికారులు చెబుతున్న లెక్కల ప్రకారం..191 వెంచర్లు ఉంటే.. వాటికి సంబంధించి 10 శాతం ల్యాండ్‌ కింద వందల కోట్ల విలువైన భూములు కడ్తాల్‌ పంచాయతీలో నమోదై ఉండాలి. భవిష్యత్‌ అవసరాల కోసం ల్యాండ్‌ బ్యాంక్‌ నే ఏర్పాటు చేయొచ్చు. కానీ.. సంబంధిత అధికారుల వద్ద 10 శాతం ల్యాండ్‌‌కు సంబంధించిన లెక్కలు కూడా పూర్తి స్థాయిలో లేనట్లు తెలుస్తోంది. కొంతమంది రియల్టర్లు ల్యాండ్‌ ఇచ్చినట్లు రికార్డుల్లో చూపిస్తున్నప్పటికీ.. అవి ఎక్కడెక్కడ ఉన్నాయో! తెలిపే బోర్డులు ఇక్కడ మచ్చుకైనా కనిపించవు.

Next Story