‘ఆ అర్రలో ఆరుగురమే ఉన్నాము’.. సిట్ విచారణపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

by Gantepaka Srikanth |

ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణకు పూర్తిగా సహకరించానని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు.

‘ఆ అర్రలో ఆరుగురమే ఉన్నాము’.. సిట్ విచారణపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: ఫోన్ ట్యాపింగ్ కేసు(Phone Tapping Case)లో విచారణకు పూర్తిగా సహకరించానని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) అన్నారు. శుక్రవారం తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. తమ పార్టీ నేతల వ్యక్తిత్వ హననానికి బాధ్యులెవరు? అని అధికారులను ప్రశ్నించినట్లు కేటీఆర్ చెప్పారు. లీకులతో తమకు సంబంధం లేదని అధికారులు చెప్పినట్లు తెలిపారు. ప్రతిపక్ష పార్టీగా తాము బాధ్యతగా ఉంటాం. ఎన్నిసార్లు విచారణల పేరుతో వేధించినా తట్టుకుంటాం.. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉంటామని అన్నారు. ఎవరికీ భయపడం అని వెల్లడించారు. హీరోయిన్ల చుట్టూ జరుగుతున్న ప్రచారం నిజం కాదని స్వయంగా పోలీసులే స్పష్టం చేశారు. అయినా రాజకీయ స్వలాభం కోసం మంత్రులు ఆరోపణలు చేయడం సరికాదని అన్నారు. సింగరేణి టెండర్లలో దొంగలు దొరికారు.. ఆధారాలతో హరీష్ రావు బయటపెట్టినా ఇప్పటివరకు ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు. స్వయంగా మంత్రి కుమారుడు గుండాగిరి చేస్తున్నా.. చర్యలు లేవు.. అక్కడ సిట్ కూడా లేదని అన్నారు. బొగ్గు కుంభకోణం కేసులో సీఎం రేవంత్ రెడ్డి బావమరిది కింగ్ పిన్ అని అని ఆధారాలు ఉన్నాయి.. చర్యలు తీసుకునే దమ్ము ప్రభుత్వానికి ఉన్నదా? అని కేటీఆర్ ప్రశ్నించారు.

మా ఫోన్లు ట్యాపింగ్ చేస్తున్నారా?

ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ అధికారులు విచారణకు పిలిచి అడిగిన ప్రశ్నలే అడిగి వేధిస్తున్నారు. అధికారులు సైతం ఈ కేసుతో టైంపాస్ చేస్తున్నారు. లోపల ఏదో జరిగిపోతోందని ప్రచారం చేశారు. మా ఫోన్లు ట్యాపింగ్ చేస్తున్నారా? లేదా? అని అడిగితే అధికారులు సమాధానం చెప్పకుండా దాటవేశారు. సెలక్టివ్‌గా లీకులు ఇచ్చి తప్పుడు ప్రచారం చేశారు. ఆ అర్రలో(గదిలో) ఆరుగురమే ఉన్నాం. అధికారులు, నేను తప్పా ఎవరూ లేరు. అక్కడి విషయాలు బయటకు ఎళా వెళ్తున్నాయి. దీనిని ప్రజలు గమనించాలని కేటీఆర్ కోరారు.

Next Story