నియంతృత్వ పోకడలు అంటూ రెచ్చిపోయిన కవిత.. స్పందించిన కేటీఆర్

by Gantepaka Srikanth |

ఫోన్ ట్యాపింగ్ కేసుపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు.

నియంతృత్వ పోకడలు అంటూ రెచ్చిపోయిన కవిత.. స్పందించిన కేటీఆర్
X

దిశ, వెబ్‌డెస్క్: ఫోన్ ట్యాపింగ్ కేసు(Phone Tapping Case)పై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత(Kalvakuntla Kavitha) చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) స్పందించారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘కవితపై ఇప్పటికే పార్టీ క్రమశిక్షణ చర్యలు తీసుకుంది. మళ్లీ నేను ప్రత్యేకంగా స్పందించాల్సిన అవసరం లేదు. రాజకీయాల్లో రోజూ చాలామంది చాలా రకాలుగా మాట్లాడుతారు. ప్రతీ వ్యక్తికి, ప్రతీ టాపిక్‌కు కౌంటర్‌కు ఇవ్వాల్సిన అవసరం లేదు’ అని కేటీఆర్ మాట్లాడారు.

కవిత ఏం మాట్లాడారంటే..

ఫోన్ ట్యాపింగ్ కేసులో నన్ను సిట్ విచారణకు రమ్మంటే వెళ్తానని అన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ తరపున ఎవరు నిలబడ్డా కారు గుర్తుపై ఓటు వేయాలని కేటీఆర్ చెబుతున్నారని ప్రస్తావించారు. చెడ్డ వాళ్లకి ఓటు వేయాలని కేటీఆర్ చెబుతున్నారా? అని కవిత ప్రశ్నించారు. కేటీఆర్ మాటలు నియంతృత్వం, రాచరికపు పోకడలకు నిదర్శనమని విమర్శించారు. మున్సిపల్ ఎన్నికల్లో కులం కాదని.. గుణం చూసి ఓటేయాలని పిలుపునిచ్చారు. పైసలు కాదని.. పని చేసేవారికి ఓటు వేయాలని సూచించారు. మంచి అభ్యర్థులు ఏ పార్టీ నుంచి పోటీ చేసిన ఓటు వేయాలని కోరారు. తెలంగాణ జాగృతి తరఫున మంచి అభ్యర్థులు ఫార్వర్డ్ బ్లాక్ గుర్తుపై పోటీ చేస్తున్నారని కవిత పేర్కొన్నారు.

Next Story