- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Erravalli: కేసీఆర్‌తో సమావేశమైన కేటీఆర్
సిద్దిపేట జిల్లా మర్కూక్ మండలంలోని ఎర్రవెల్లి ఫామ్‌హౌజ్‌లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌తో ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ భేటీ అయ్యారు.

దిశ, వెబ్‌డెస్క్: సిద్దిపేట జిల్లా మర్కూక్ మండలంలోని ఎర్రవెల్లి ఫామ్‌హౌజ్(Erravelli Farmhouse)లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్(KCR)తో ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) భేటీ అయ్యారు. మున్సిపల్ ఎన్నికలు, ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ నోటీసులు, విచారణ సంబంధిత అంశాలపై ఇరువురి మధ్య చర్చ జరుగుతున్నట్లు సమాచారం. మరోవైపు నిన్న ఇదే ఫామ్‌హౌజ్‌లో కేసీఆర్‌తో హరీష్ రావు భేటీ అయిన విషయం తెలిసిందే. సిట్ ముందు హాజరై వివరణ ఇవ్వాల్సిన అంశాలు, అడిగే ప్రశ్నలకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, సమాధానాలపై ఇద్దరి మధ్య విస్తృతంగా చర్చించినట్లు తెలుస్తోంది. ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, మున్సిపల్ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో సిట్ నివేదిక వెలువడటం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ నోటీసులను ఎలా ఎదుర్కోవాలి, పార్టీకి నష్టం కలగకుండా ప్రజల్లో వాస్తవాలు ఎలా తీసుకెళ్లాలన్న విషయాలపై సమాలోచన జరిగినట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. ప్రభుత్వ వైఖరి, ప్రతిపక్షాల ఆరోపణలకు సమాధానం ఇవ్వాల్సిన వ్యూహాలపై కూడా చర్చ జరిగినట్లు సమాచారం. రాబోయే రోజుల్లో పార్టీ తీసుకోవాల్సిన రాజకీయ అడుగులు, ప్రజా ఉద్యమాల రూపకల్పన, మీడియా ముందుకు వెళ్లాల్సిన అంశాలపై కూడా కేసీఆర్, హరీష్ రావు, ఇవాళ్టి కేటీఆర్ భేటీలో చర్చ జరిగినట్లు తెలిసింది. ఈ సమావేశం రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికర చర్చకు దారి తీస్తోంది.






