- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రాజ్యాంగ ప్రతిష్ట దెబ్బతీస్తున్న రేవంత్ రెడ్డి : కేటీఆర్
రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి అడుగడుగునా రాజ్యాంగ ప్రతిష్ట దెబ్బతీస్తున్నారని కేటీఆర్ ట్వీట్ చేశారు.

దిశ, వెబ్ డెస్క్ : పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలను నిస్సిగ్గుగా వెనకేసుకుని వస్తున్న రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి అడుగడుగునా రాజ్యాంగాన్ని అవహేళన చేస్తూ, రాజ్యాంగ ప్రతిష్ట దెబ్బతీస్తున్నారని కేటీఆర్ ట్వీట్ చేశారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలైన కాలె యాదయ్య, పోచారం శ్రీనివాస్ రెడ్డిపై వేటు వేయాల్సిన స్పీకర్.. వ్యవస్థను రాజకీయ ఒత్తిళ్లతో భ్రష్టుపట్టించిన కాంగ్రెస్ పార్టీ తన దిగజారుడుతనాన్ని మరోసారి చూపించిందని విమర్శించారు. పార్టీ మారినట్టు కళ్లముందే ఆధారాలు కనిపిస్తున్నా ఆధారాలు లేవని చెప్పడం శాసనసభను అవమానించడమేనని అన్నారు. కాంగ్రెస్‌కు రాజ్యాంగంపైనా, న్యాయస్థానాలపైనా గౌరవం లేదని ఈ తీర్పుతో స్పష్టమైందని పేర్కొన్నారు.
పంచాయతీ ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్‌కు గట్టి బుద్ధి చెప్పడంతో ఫిరాయింపు ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో ఉపఎన్నికలకు వెళ్లేందుకు అధికార పార్టీ భయపడుతోందని ఆరోపించారు. గోడ దూకిన ఎమ్మెల్యేలు ఇప్పటికే ప్రజల కోర్టులో “మాజీలు” అయిపోయారని, వారికి కాంగ్రెస్ కండువాలు కప్పిన సీఎం, పార్టీకి ప్రజలే సరైన బుద్ధి చెబుతారని కేటీఆర్ స్పష్టం చేస్తూ, అప్పటివరకు BRS పోరాటం కొనసాగుతుందని కేటీఆర్ స్పష్టం చేసారు.






