లేడీ ఓరియంటెడ్‌ మూవీ.. బలమైన కథ కావాలంటున్న బేబమ్మ

by Disha Web Desk 7 |
లేడీ ఓరియంటెడ్‌ మూవీ.. బలమైన కథ కావాలంటున్న బేబమ్మ
X

దిశ, సినిమా : బ్యూటిఫుల్ యాక్ర్టెస్ కృతిశెట్టి తన కల నిజం చేసుకునే దిశగా అడుగులేస్తున్నట్లు పేర్కొంది. హీరో నితిన్‌కు జంటగా ఆమె నటించిన 'మాచర్ల నియోజకవర్గం' సినిమా ఈ నెల 12న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సందర్భంగా ప్రమోషన్స్‌లో పాల్గొంటున్న కృతి.. తన పర్సనల్ గోల్స్ గురించి ఓపెన్ అయింది. చిన్నప్పటి నుంచి తనకు ఒక 'ఎన్‌జీ‌వో' సంస్థ ప్రారంభించి, ఎంతోమందికి సాయపడాలనే కోరిక ఉందని చెప్పింది. త్వరలోనే ఆ పని మొదలుపెట్టేందుకు సిద్ధమవుతున్నానని, దాని తర్వాత ఒక్కో డ్రీమ్ నెరవేర్చుకుంటానని వెల్లడించింది. ఇక ఈ మూవీతో మంచి స్నేహితుడైన నితిన్‌ను నిజాయితీకి మారుపేరుగా ప్రశంసించిన బేబమ్మ.. లేడీ ఓరియంటెడ్‌ సినిమాలు చేయాలనే ఆలోచన ఇప్పుడైతే లేదని, దర్శక నిర్మాతలు బలమైన కథతో సంప్రదిస్తే ఆలోచిస్తానని స్పష్టం చేసింది.


Next Story

Most Viewed