సీఎం కేసీఆర్, సీఎస్ ‌అవినీతిపై ప్రధానికి ఫిర్యాదు చేశా.. కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు

by samatah |
సీఎం కేసీఆర్, సీఎస్ ‌అవినీతిపై ప్రధానికి ఫిర్యాదు చేశా.. కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు
X

దిశ, డైనమిక్ బ్యూరో : తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ చేసిన అవినీతిపై పూర్తి వివరాలతో ప్రధాని మోడీకి ఫిర్యాదు చేసినట్లు ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. బొగ్గు గనులలో జరిగిన కుంభకోణంపై సీఎం కేసీఆర్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. 134 మంది ఐఏఎస్‌లు ఖాళీగా ఉన్నారని, మరి సీఎస్ దగ్గర 6 నుంచి 8 శాఖలు ఎందుకని ప్రశ్నించారు. ఏవైనా హై ఎండ్ బిల్డింగ్ ఫైల్స్ సాంక్షన్ కావాలంటే సీఎస్ రూ.5 నుంచి రూ.10 కోట్లు ముట్టచెబితేనే సాంక్షన్ అవుతాయని తమకు ఫిర్యాదు వచ్చినట్లు చెప్పారు. సీఎస్ సోమేష్ కుమార్‌ను ఢిల్లీకి తీసుకెళ్లాలని, ఆయనపై చర్యలు తీసుకోవాలని ప్రధాని మోడీకి చేసిన ఫిర్యాదులో ఉన్నాయన్నారు. తెలంగాణ అభివృద్ధి కోసం నేను పోరాడుతానని చెప్పారు. నాది ఒకే మాట, ఒకే బాట అని నేను చనిపోయినప్పుడు కూడా మూడు రంగుల జెండానే కప్పమని చెప్పానన్నారు. ధనిక రాష్ట్రమని చెప్పే తెలంగాణ ప్రభుత్వం రైతులు పండించిన ధాన్యాన్ని కొనలేదా అని ప్రశ్నించారు. సొంతంగా ధాన్యం కొనడానికి డబ్బులు లేవు కాని, సెక్రటేరియేట్, ప్రగతి భవన్, ఫామ్ హౌస్ అంటూ ఖర్చు చేస్తారా అంటూ మండిపడ్డారు.

Next Story