- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సెంచరీతో రెచ్చిపోయిన కేఎల్ రాహుల్.. న్యూజిలాండ్ టార్గెట్ ఎంతంటే..?
భారత్ న్యూజిలాండ్ జట్ల మధ్య జరుగుతున్న రెండో వన్డేలో కేఎస్ రాహుల్ అద్బుతమైన సెంచరితో రెచ్చిపోయాడు.

దిశ, వెబ్ డెస్క్: భారత్ న్యూజిలాండ్ జట్ల మధ్య జరుగుతున్న రెండో వన్డే (Second ODI)లో కేఎల్ రాహుల్ (KL Rahul) అద్బుతమైన సెంచరితో రెచ్చిపోయాడు. రాజ్ కోట్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచులో టాస్ గెలిచిన న్యూజిలాండ్ జట్టు బౌలింగ్ ఎంచుకుంది. దీంతో మొదట బ్యాటింగ్ చేసిన భారత జట్టు మొదటి వికెట్ కు 70 పరుగుల భాగస్వామ్యాన్ని అందించింది. ఆ తర్వాత వెంట వెంటనే వికెట్లు కోల్పోగా ఐదో వికెట్ కు కేఎల్ రాహుల్, జడేజా కలిసి 73 పరుగుల బాగాస్వామ్యాన్ని నెలకొల్పారు. అనంతరం జడెజా 27 పరుగులకు అవుట్ కాగా నితీష్ కుమార్ రెడ్డితో కలిసి కేఎల్ రాహుల్ 53 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు.
ఈ క్రమంలో మొత్తం 92 బంతులను ఫేస్ చేసిన రాహుల్ 11 ఫోర్లు, 1 సిక్సర్ తో 112 పరుగులు చేసి, భారత్ భారీ స్కోర్ చేయడంలో కీలక పాత్ర పోషించాడు. భారత బ్యాటర్లలో రోహిత్ 25, గిల్ 56, కోహ్లీ 23, జడెజా 27, నితీష్ కుమార్ రెడ్డి 20 పరుగులతో రాణించారు. దీంతో భారత జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 284 పరుగులు చేసింది. న్యూజిలాండ్ బౌలర్లలో క్రిష్టియన్ 3, జెమిసన్, జకర్రీ, లెనోక్స్, బాస్వెల్ ఒక్కో వికెట్ తీసుకున్నారు. ఈ మ్యాచులో న్యూజిలాండ్ విజయం సాధించాలంటే నిర్ణీత 50 ఓవర్లలో 285 పరుగులు చేయాల్సి ఉంది. మరి ఈ మ్యాచ్ లో ఏ జట్టు గెలుస్తుందో తెలియాలంటే మ్యాచ్ చివరి వరకు చూడాల్సిందే.






