- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కిష్త్వార్ ఎన్‌కౌంటర్ అప్‌డేట్.. హతమైన మూడవ ఉగ్రవాది
కిష్త్వార్ ఎన్‌కౌంటర్‌లో మూడవ ఉగ్రవాది హతం! ఆపరేషన్ త్రాషి-Iలో భద్రతా బలగాల భారీ విజయం. ఆయుధాలు స్వాధీనం, కొనసాగుతున్న గాలింపు."

దిశ, వెబ్ డెస్క్: భారత బలగాలు, రాష్ట్ర పోలీసులతో కలిసి నిర్వహించిన 'ఆపరేషన్ త్రాషి-I' ('Operation Thrashi-I') విజయవంతం అయింది. ఉగ్రవాదులు ఉన్నారనే పక్కా సమచారంతో జమ్మూ కాశ్మీర్‌లోని కిష్త్వార్ జిల్లా (Kishtwar District)లో ఆదివారం భద్రతా బలగాలు 'ఆపరేషన్ త్రాషి-I'చేపట్టి.. భారీ విజయం సాదించారు. ఈ ఆపరేషన్‌లో ఉదయం ఇద్దరు ఉగ్రవాదులు హతం కాగా, తాజాగా నిర్వహించిన సంయుక్త ఆపరేషన్‌లో మూడవ ఉగ్రవాదిని కూడా భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. భారత సైన్యానికి చెందిన వైట్ నైట్ కోర్ప్స్, జమ్మూ కాశ్మీర్ పోలీసులు, సిఆర్‌పిఎఫ్ బలగాలు అత్యంత కఠినమైన భౌగోళిక పరిస్థితుల్లో ఈ ఆపరేషన్‌ను సమన్వయంతో నిర్వహించాయి.
ఈ ఎన్ కౌంటర్‌లో హతమైన మూడవ ఉగ్రవాది మృతదేహాన్ని, అతడి వద్ద ఉన్న ఆయుధాలను బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. "స్థిరత్వాన్ని దెబ్బతీయాలని చూసే వారికి ఎక్కడా ఆశ్రయం ఉండదు" అని వైట్ నైట్ కోర్ప్స్ ఎక్స్ (X) వేదికగా హెచ్చరించింది. ఈ ప్రాంతంలో ఇంకా ఎవరైనా ఉగ్రవాదులు నక్కి ఉన్నారా అనే కోణంలో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. దీంతో ప్రస్తుతం కిష్త్వార్ జిల్లాలో కర్ఫ్యూ వాతావరణం కొనసాగుతోంది.






