మున్సిపల్ ఎన్నికలపై కీలక అప్‌డేట్.. కలెక్టర్లతో ఎస్‌ఈసీ వీడియో కాన్ఫరెన్స్

by Kema Shiva Kumar |

రాష్ట్రంలో త్వరలో జరగనున్న మున్సిపల్ ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని కసరత్తు వేగవంతం చేశారు.

మున్సిపల్ ఎన్నికలపై కీలక అప్‌డేట్.. కలెక్టర్లతో ఎస్‌ఈసీ వీడియో కాన్ఫరెన్స్
X

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో త్వరలో జరగనున్న మున్సిపల్ ఎన్నికల (Municipal Elections) నిర్వహణపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని (Rani Kumudini) కసరత్తు వేగవంతం చేశారు. ఎన్నికల ఏర్పాట్లు, ఓటరు జాబితాల రూపకల్పన, పోలింగ్ కేంద్రాల ఏర్పాటుపై వివిధ జిల్లాల కలెక్టర్లతో ఆమె వరుసగా వీడియో కాన్ఫరెన్స్‌లు నిర్వహించనున్నారు. తాజాగా ఇవాళ ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాల కలెక్టర్లతో ఆమె వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొని ఆయా మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో ఎన్నికల సన్నద్ధతను సమీక్షించారు.

రేపు ఉమ్మడి నిజామాబాద్, ఖమ్మం, వరంగల్ జిల్లాల కలెక్టర్లతో రాణి కుముదిని సమావేశం కాబోతున్నారు. ఈ సందర్భంగా ఆయా ప్రాంతాల్లోని మున్సిపాలిటీల్లో ఎన్నికల నిర్వహణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఆమె దిశానిర్దేశం చేయనున్నారు. ఇక ఎల్లుండి మూడో రోజు ఉమ్మడి నల్గొండ, మహబూబ్ నగర్ జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ షెడ్యూల్ కూడా ఫిక్స్ అయింది. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమలు, సిబ్బంది నియామకం, శాంతిభద్రతల పరిరక్షణ వంటి కీలక అంశాలపై ఈ భేటీలో ప్రధానంగా చర్చించబోతున్నట్లుగా తెలుస్తోంది. క్షేత్రస్థాయిలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్లాలని కలెక్టర్లకు ఎస్ఈసీ రాణి కుముదిని పర్‌ఫెక్ట్ గైడ్‌లైన్స్ ఇవ్వనున్నారు.

Next Story