మాస్క్ 'మస్ట్'.. రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం

by Disha Web Desk 19 |
Kerala Brings Back Wearing Mask Mandate as Corona Cases Rise Again
X

దిశ, వెబ్‌డెస్క్: Kerala Brings Back Wearing Mask Mandate as Corona Cases Rise Again| ప్రపంచ దేశాలను గడగడలాడించిన కరోనా మహమ్మారి దేశంలో మళ్లీ చాపకింద నీరులా విస్తరిస్తోంది. ఇప్పుడిప్పుడే కాస్త కరోనా ఆంక్షల నుండి కోలుకుంటున్న ప్రజలపై మళ్లీ పంజా విసురుతోంది. రోజురోజుకు దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. దీనితో అప్రమత్తమైన కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలను అలర్ట్ చేస్తోంది. కరోనా కట్టడికి చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. ఇందులో భాగంగా మంగళవారం కేరళ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతుండటంతో ఫేస్ మాస్క్‌లు మళ్లీ తప్పనిసరి చేసింది. బహిరంగ ప్రదేశాలలో, సమావేశాల వద్ద ఫేస్ మాస్క్‌లు తప్పక ధరించాలని ఆదేశించింది.. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై విపత్తు నిర్వహణ చట్టం కింద చర్యలు తీసుకుంటామని తెలిపింది. అంతేకాకుండా నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కనీసం రూ. 500 జరిమానా విధించాలని పోలీసులను ఆదేశించారు.

Next Story

Most Viewed