- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కౌశిక్ రెడ్డి విడుదల
ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని సైదాపూర్ పోలీస్ స్టేషన్ నుండి విడుదల చేశారు.

దిశ,హుజురాబాద్ : వీణవంక మండల కేంద్రంలో జరుగుతున్న సమ్మక్క సారలమ్మ జాతర సందర్భంగా జరిగిన వివాదములో అదుపులోకి తీసుకున్న హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని గురువారం రాత్రి 10: 20 గంటలకు సైదాపూర్ పోలీస్ స్టేషన్ నుండి విడుదల చేశారు. వీణవంకలో కౌశిక్ రెడ్డిని అదుపులో తీసుకున్న పోలీసులు శంకరపట్నం మీదుగా సైదాపూర్ పోలీస్ స్టేషన్ కు తీసుకు వచ్చిన విషయాన్ని కౌశిక్ రెడ్డి కేటీఆర్ కు తెలపగా ఆయన పార్టీకి చెందిన ముఖ్య నేతలకు సమాచారమిచ్చి కౌశిక్ రెడ్డి విడుదల అయ్యేంతవరకు పోలీస్ స్టేషన్ వద్ద ఉండాలని ఆదేశించినట్లు సమాచారం. కేటీఆర్ ఆదేశాల మేరకు హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే సతీష్ బాబు హుటాహుటిన సైదాపూర్ పోలీస్ స్టేషన్ కు వచ్చి అధికారులతో సంప్రదింపులు జరిపారు.ఈ మేరకు కౌశిక్ రెడ్డిని పోలీసులు విడుదల చేయగా ఆయన నేరుగా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి వెళ్లినట్లు సమాచారం. కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ సైతం వస్తున్నట్లు సమాచారం.






