- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
విజయ్ నా కాళ్లపై పడ్డారు : కరూర్ బాధితురాలు
గతేడాది సెప్టెంబరులో జరిగిన కరూర్ తొక్కిసలాట ఘటనపై ఓ బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసారు.

దిశ, వెబ్ డెస్క్ : గతేడాది సెప్టెంబరులో కరూర్ వద్ద జరిగిన విషాదకరమైన తొక్కిసలాట ఘటనపై ఒక బాధితురాలు వ్యక్తం చేసిన భావోద్వేగపూరితమైన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తమ అభిమాన నటుడు విజయ్ రాజకీయాల్లోకి రావడం పట్ల ఆమె ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేశారు. అయితే, 2025 సెప్టెంబర్ 27న విజయ్‌ను చూడాలనే ఆశతో వెళ్లిన తన కుటుంబ సభ్యులు ఆ తొక్కిసలాటలో ప్రాణాలు కోల్పోవడంతో తమ కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయిందని, ఆ ఘటన తమను రోడ్డు పాలు చేసిందని ఆమె ఆవేదన చెందారు. ఈ ఘటన జరిగిన కొద్దిరోజుల తర్వాత, విజయ్ స్వయంగా ఆ బాధితురాలి ఇంటికి వెళ్లారు. అక్కడ ఆయన బాధితురాలి కాళ్లపై పడి జరిగిన దానికి క్షమాపణలు వేడుకోవడమే కాకుండా, ప్రజలకు సేవ చేసే లక్ష్యంతో ముందుకు వెళ్తున్న తనకు ఒక అవకాశం ఇవ్వాలని కోరారు.
విజయ్ చూపిన వినయం, ఆయన ఆశయం నచ్చడంతో ఆమె తన మద్దతును ప్రకటించారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఆయనకు ఓటు వేశానని, ఇప్పుడు ఆయన అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో ప్రజల సంక్షేమం కోసం మనస్ఫూర్తిగా కృషి చేస్తారని ఆశిస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు. కాగా తమిళగ వెట్రి కళగం (TVK) అధినేత విజయ్ నిర్వహించిన బహిరంగ సభలో జరిగిన తొక్కిసలాటలో 41 మంది మరణించగా, 100 మందికి పైగా గాయపడ్డారు. ఈ ఘటన తమిళనాడు రాజకీయాల్లో. ప్రజల్లో తీవ్ర చర్చకు దారితీసింది. బాధితురాలి మాటలు చూస్తుంటే, విజయ్ తన వ్యక్తిగత పరామర్శలతో బాధితుల గాయాలను మాన్పే ప్రయత్నం చేశారని అర్థమవుతోంది.






