నేను వాళ్ల చెంప పగలగొడతా.. కంగనా

by Disha Web Desk 12 |
నేను వాళ్ల చెంప పగలగొడతా.. కంగనా
X

దిశ, సినిమా : బాలీవుడ్ నటి కంగనా రనౌత్‌.. హాలీవుడ్‌ హీరో 'విల్‌ స్మిత్‌' వివాదంపై తన అభిప్రాయాన్ని వెల్లడించింది. ఇటీవల జరిగిన 'ఆస్కార్' అవార్డ్ ఫంక్షన్‌‌లో కమెడియన్ క్రిస్‌ రాక్‌‌‌ను అతను చెంపదెబ్బ కొట్టడం ప్రపంచవ్యాప్త చర్చకు దారితీసిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ ఇష్యూ పై స్పందించిన కంగనా.. తొందరలోనే స్మిత్ తన 'లాక్‌అప్‌'కు వస్తాడని చెప్పింది. ఇక స్మిత్ చెంపదెబ్బకు సంబంధించిన ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో షేర్ చేసిన నటి.. 'కొంతమంది మూర్ఖులను నవ్వించేందుకు నా తల్లి లేదా చెల్లి అనారోగ్యంపై కుళ్లు జోకులు వేస్తే నేను కూడా విల్‌ స్మిత్‌ మాదిరే చెంప పగలగొడ్తాను. అలా చేసిన విల్‌ స్మిత్‌ తప్పకుండా నా లాక్‌అప్‌కు వస్తాడని ఆశిస్తున్నా' అంటూ నోట్ యాడ్ చేసింది. కాగా 'ఆస్కార్' అవార్డ్స్ వేడుకల్లో భాగంగా స్మిత్ భార్యపై క్రిస్ రాక్ కాంట్రవర్సీ జోక్ వేసినందుకు ఆగ్రహానికి గురైన స్మిత్ అతని చెంప పగలగొట్టాడు.

Next Story

Most Viewed