ఆర్ఆర్ఆర్ అట్టర్ ఫ్లాప్ మూవీ.. రాజమౌళిని జైల్లో పెట్టాలి: కమల్ ఆర్.ఖాన్

by Disha Web Desk 19 |
ఆర్ఆర్ఆర్ అట్టర్ ఫ్లాప్ మూవీ.. రాజమౌళిని జైల్లో పెట్టాలి: కమల్ ఆర్.ఖాన్
X

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు రాజామౌళి దర్శకత్వంలో.. ఎన్టీఆర్, రాంచరణ్ హీరోలుగా పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కిన చిత్రం ఆర్ఆర్ఆర్. ప్రపంచవ్యాప్తంగా మార్చి 25న విడుదలైన ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి ప్రశంసలు అందుకుంటుంది. సూపర్ హిట్ టాక్‌తో దూసుకుపోతున్న ఆర్ఆర్ఆర్ మూవీకి.. అభిమానుల నుండి, సినీ ప్రముఖుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తున్నాయి. ఈ క్రమంలో ఆర్ఆర్ఆర్ సినిమాపై బాలీవుడ్ క్రిటిక్, యాక్టర్ కమల్ ఆర్.ఖాన్ ట్వీట్టర్ వేదికగా సంచలన వ్యాఖ్యలు చేశాడు.

' ఆర్ఆర్ఆర్ తలా తోకా లేని సౌత్ మసాలా సినిమా.. రాజమౌళి సాబ్.. తమాషా కొంచెం ఎక్కువ అయింది..? కొంత అయినా లిమిట్ ఉండాలి కదా.. మీరు అన్ లిమిటెడ్ నుంచి ఊడిపడ్డారని' తీవ్రంగా విమర్శించాడు. అంతే కాకుండా 'భారతీయ సినీ చర్రితలోనే ఆర్ఆర్ఆర్ అతి చెత్త సినిమా.. ఇదొక పెద్ద నేరం.. 600 కోట్ల రూపాయల బడ్జెట్ పెట్టి ఇటువంటి చెత్త సినిమా తీసిన రాజమౌళిని ఆరు నెలలు జైల్లో పెట్టాలని' వరుస ట్వీట్‌లతో మండిపడ్డారు. అయితే, కమల్ ఆర్ ఖాన్ గతంలో బాహుబలి సినిమాను కార్టూన్‌తో పోల్చి విమర్శల పాలయ్యాడు. దీనితో ఎన్టీఆర్, చరణ్ అభిమానులు మండిపడుతున్నారు.

Next Story

Most Viewed