ఉద్యమాల గడ్డ పై మతతత్వ పార్టీ అవసరమా ? : ఎమ్మెల్సీ కడియం శ్రీహరి

by Dishanational2 |
ఉద్యమాల గడ్డ పై మతతత్వ పార్టీ అవసరమా ? : ఎమ్మెల్సీ కడియం శ్రీహరి
X

దిశ, స్టేషన్ ఘన్ పూర్: ఉద్యమాల పురిటిగడ్డ తెలంగాణలో మతతత్వ బీజేపీ పార్టీ అవసరమా ? అని ఎమ్మెల్సీ, మాజీ ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి ప్రశ్నించారు. జనగామ జిల్లా స్టేషన్ ఘన్ పూర్ మండల కేంద్రంలో 37 మందికి ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను ఆదివారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయని సంక్షేమ అభివృద్ధి పథకాలను టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసి ఆదర్శంగా నిలిచిందన్నారు. 2022 -23 ఆర్థిక సంవత్సరం 2 లక్షల 56 వేల 960 కోట్ల వార్షిక బడ్జెట్లో 95 వేల కోట్లు సంక్షేమ కోసం ఖర్చు చేయనున్నట్లు తెలిపారు. అలాగే రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పనకు 1,33,942 ఉద్యోగాలు భర్తీ చేసేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది అన్నారు. 11 వేల 103 మంది కాంట్రాక్టు ఉద్యోగులను పర్మినెంట్ చేసిందన్నారు. వరి ధాన్యం ఉత్పత్తిలో రాష్ట్ర ప్రభుత్వం మొదటి స్థానానికి చేరుకుందని, యాసంగి‌లో వరి సాగు చేయిమన్న బండి, కిషన్ రెడ్డి‌లకు దమ్ముంటే కేంద్రంపై ఒత్తిడి చేసి వరి ధాన్యం కొనుగోలు చేయించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రానికి విభజన హామీలు అమలు చేయమని, కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించాలని బీజేపీ ప్రభుత్వం రాష్ట్రంలో మతతత్వాన్ని పెంచి పోషిస్తోందని అలాంటి బీజేపీని తెలంగాణ నుంచి తరిమి కొట్టాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో ఈ సంస్థ చైర్మన్ కృష్ణారెడ్డి, నరేందర్ రెడ్డి, కరుణాకర్ రావు, లింగారెడ్డి, వెంకన్న, రాజేష్ నాయక్, స్వామి నాయక్, రాజ్ కుమార్, వెంకటయ్య, ఉప్పల స్వామి నియోజకవర్గంలోని ప్రజా ప్రతినిధులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed