- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పాఠశాల దాడికి ప్రతీకారం తీర్చుకుంటాం : మొజ్తాబా ఖమేనీ
అమెరికా- ఇజ్రాయెల్ దేశాలతో భీకర యుద్ధం కొనసాగుతున్న వేళ ఇరాన్ నూతన సుప్రీం లీడర్ ఆయతుల్లా మొజ్తాబా ఖమేనీ తొలిసారి స్పందించారు.

దిశ, వెబ్ డెస్క్ : ఇజ్రాయెల్-అమెరికా కూటమితో భీకర యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో, ఇరాన్ నూతన సుప్రీం లీడర్ ఆయతుల్లా మొజ్తాబా ఖమేనీ (Ayatollah Mojtaba Khamenei) చేసిన తొలి అధికారిక ప్రకటన అంతర్జాతీయ రాజకీయాల్లో తీవ్ర సంచలనమ్ రేపుతోంది. ఇంతకీ మొజ్తాబా ప్రకటనలో ఏముందంటే..?
గల్ఫ్ దేశాలకు హెచ్చరిక
మొజ్తాబా ఖమేనీ తన ప్రసంగంలో ప్రపంచ వాణిజ్యానికి కీలకమైన హార్ముజ్ జలసంధి(Strait of Hormuz) గురించి ప్రస్తావిస్తూ, శత్రువులపై ఆర్థిక, వ్యూహాత్మక ఒత్తిడిని పెంచేందుకు ఈ మార్గాన్ని మూసివేయడం కొనసాగుతుందని స్పష్టం చేశారు. అదే సమయంలో పొరుగున ఉన్న గల్ఫ్ దేశాలకు గట్టి హెచ్చరిక జారీ చేశారు.
అమెరికా స్థావరాలే లక్ష్యం
గల్ఫ్ దేశాల్లోని అమెరికా సైనిక స్థావరాలను తక్షణమే మూసివేయాలని, లేనిపక్షంలో వాటిపై దాడులు కొనసాగుతాయని హెచ్చరించారు. అలాగే ఇరాన్ పొరుగు దేశాలతో స్నేహాన్ని ఆకాంక్షిస్తుందని చెబుతూనే, ఆ దేశాల్లోని విదేశీ బలగాలను మాత్రం తమకు ముప్పుగానే చూస్తామని పేర్కొన్నారు.
ప్రతీకారం తప్పదూ..!
ఇటీవల జరిగిన ఇరాన్ లోని మినాబ్ పాఠశాలపై దాడి సహా ఇతర ఘటనలను ఆయన తీవ్రంగా ఖండించారు. ఈ దాడులకు ఖచ్చితంగా ప్రతీకారం తీర్చుకుంటామని హెచ్చరించారు. కష్టకాలంలో ఇరాన్ సైనికులు ప్రదర్శిస్తున్న ధైర్యసాహసాలను ఆయన ప్రశంసించారు. యుద్ధంలో గాయపడిన వారికి ఉచిత వైద్యం అందిస్తామని, బాధిత కుటుంబాలను ఆర్థికంగా ఆదుకుంటామని ప్రభుత్వం తరపున హామీ ఇచ్చారు. సుప్రీం లీడర్ గా మొజ్తాబా ఖమేనీ నియామకం తర్వాత దేశ ప్రజలను ఉద్దేశించి చేసిన ఈ ప్రకటన ఇరాన్ రక్షణ దళాలలో కొత్త ఉత్సాహాన్ని నింపింది.






