- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ట్రంప్ తలపై రూ.560 కోట్ల డాలర్లు : ఇరాన్ ప్రకటన!
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ పార్లమెంట్ అత్యంత సంచలనాత్మకమైన చట్టాన్ని తీసుకురావడానికి సిద్ధమవుతోంది.

దిశ, వెబ్ డెస్క్ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ పార్లమెంట్ అత్యంత సంచలనాత్మకమైన చట్టాన్ని తీసుకురావడానికి సిద్ధమవుతోంది. అంతర్జాతీయ దౌత్య నిబంధనలను పక్కనబెట్టి, ట్రంప్ ను హతమార్చిన వారికి ఏకంగా 50 మిలియన్ యూరోల (సుమారు 560 కోట్ల రూపాయలు) భారీ బహుమతిని (బౌంటీ) ప్రకటించేలా రూపొందించిన ప్రత్యేక బిల్లుపై ఇరాన్ పార్లమెంటు త్వరలోనే ఓటింగ్ నిర్వహించనుంది. ఇరాన్ పార్లమెంటుకు చెందిన జాతీయ భద్రత, విదేశాంగ విధాన కమిటీ చైర్మన్ ఇబ్రాహిం అజీజి ఇరాన్ ప్రభుత్వ అధికారిక టెలివిజన్ ఛానెల్‌లో ఈ ప్రతిపాదనను బహిరంగంగా ప్రకటించడం గమనార్హం. ఈ చట్టపరమైన బిల్లుకు "ఇస్లామిక్ రిపబ్లిక్ సైనిక, భద్రతా దళాల పరస్పర ప్రతీకార చర్య" అని పేరు పెట్టారు. ఒకవైపు అంతర్జాతీయంగా దౌత్య చర్చలు నడుస్తున్న తరుణంలోనే ఇరాన్ ఈ స్థాయి నిర్ణయానికి రావడం ప్రపంచవ్యాప్తంగా తీవ్ర సంచలనం రేపుతోంది.
ఈ సంచలన బిల్లులో కేవలం డొనాల్డ్ ట్రంప్ ను మాత్రమే కాకుండా, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు, అమెరికా సెంట్రల్ కమాండ్ (CENTCOM) సీనియర్ కమాండర్ అడ్మిరల్ బ్రాడ్ కూపర్‌ను కూడా ప్రధాన లక్ష్యంగా పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఏ ముస్లిం లేదా స్వతంత్ర వ్యక్తి అయినా సరే, ఈ ఇద్దరు నేతలను హతమార్చే 'మతపరమైన, సిద్ధాంతపరమైన మిషన్' పూర్తి చేస్తే వారికి ఇరాన్ ప్రభుత్వం అధికారికంగా 50 మిలియన్ యూరోలను బహుమతిగా చెల్లించేలా ఈ బిల్లు ద్వారా చట్టబద్ధత కల్పిస్తున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఇరాన్‌పై జరిగిన వైమానిక దాడుల్లో తమ సుప్రీం లీడర్ అయతోల్లా అలీ ఖమేనీ మరణించినందుకు ప్రతీకారంగానే ఈ బిల్లును ప్రవేశపెడుతున్నట్లు ఇరాన్ ఎంపీ, ప్రముఖ మతగురువు మహమూద్ నబవియాన్ స్పష్టం చేశారు. ఒకవేళ ఇరాన్ నాయకత్వంపై భవిష్యత్తులో అమెరికా లేదా ఇజ్రాయెల్ మరిన్ని దాడులకు పాల్పడితే, వాటికి తీవ్రమైన పరిణామాలు ఉంటాయని వారు హెచ్చరిస్తున్నారు.






