- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇజ్రాయెల్ లక్ష్యంగా ఇరాన్ క్షిపణుల దాడి.. మరోసారి హై అలర్ట్ ప్రకటించిన ఐడిఎఫ్
ఇరాన్ నుండి ఇజ్రాయెల్ పై క్షిపణుల దాడి ప్రారంభమైంది. రక్షణ వ్యవస్థలు అప్రమత్తమయ్యాయి, ప్రజలు బంకర్లలోకి వెళ్లాలని ఐడిఎఫ్ ఆదేశించింది.

దిశ, వెబ్ డెస్క్: ఇరాన్ హెచ్చరికలతో ఇజ్రాయెల్ అప్రమత్తం అయింది. ఇరాన్ నుండి ఇజ్రాయెల్ భూభాగంపైకి క్షిపణుల దాడి (Missile attack) ప్రారంభమైందని ఇజ్రాయెల్ రక్షణ దళాలు (IDF) ధృవీకరించాయి. ఈ ముప్పును తిప్పికొట్టేందుకు ఇజ్రాయెల్ రక్షణ వ్యవస్థలు ప్రస్తుతం చురుగ్గా పని చేస్తున్నాయని, గగనతలంలోనే క్షిపణులను అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నాయని ఐడిఎఫ్ (IDF) వెల్లడించింది. ఈ పరిణామాల నేపథ్యంలో హోమ్ ఫ్రంట్ కమాండ్ ఇప్పటికే ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజల మొబైల్ ఫోన్లకు ప్రాథమిక హెచ్చరికలను పంపింది.
పరిస్థితి తీవ్రతను దృష్టిలో ఉంచుకుని, ప్రజలందరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, భద్రతా సూచనలను కచ్చితంగా పాటించాలని అధికారులు కోరారు. అలర్ట్ అందిన వెంటనే ప్రజలందరూ సురక్షిత ప్రాంతాలకు లేదా బంకర్లలోకి వెళ్లాలని, తదుపరి ఆదేశాలు వచ్చే వరకు అక్కడే ఉండాలని స్పష్టం చేశారు. అధికారిక అనుమతి లభించిన తర్వాతే రక్షిత ప్రాంతాల నుంచి బయటకు రావాలని, ఈ నిబంధనలు పాటించడం వల్ల ప్రాణాలను కాపాడుకోవచ్చని ఇజ్రాయెల్ ఎయిర్ ఫోర్స్ (Israeli Air Force) తన ప్రకటనలో పేర్కొంది.






