- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బంగారం లేదు.. 10 కేసులున్నాయి : అఫిడవిట్ లో ఉదయనిధి
తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ చెపాక్-తిరువల్లికేని నియోజకవర్గం నుండి తన నామినేషన్ దాఖలు చేశారు.

దిశ, వెబ్ డెస్క్ : తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ ఏప్రిల్ 23న జరగనున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో చెపాక్-తిరువల్లికేని నియోజకవర్గం నుండి తన నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఆయన సమర్పించిన ఎన్నికల అఫిడవిట్‌లోని వివరాలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. తన పేరిట ఒక్క గ్రాము బంగారం, వెండి నగలు కూడా లేవని ఆయన పేర్కొనడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. అయితే, ఆయన భార్య కిరుత్తిగా పేరిట మాత్రం సుమారు 1,600 గ్రాముల బంగారు ఆభరణాలు ఉన్నట్లు వెల్లడించారు. ఉదయనిధి మొత్తం ఆస్తుల విలువ రూ.20.64 కోట్లుగా ఉండగా, అందులో చరాస్తులు రూ.12.92 కోట్లు మరియు స్థిరాస్తులు రూ.7.72 కోట్లుగా ఉన్నాయి. ఆసక్తికరమైన విషయమేమిటంటే, 2021 ఎన్నికలతో పోలిస్తే ఉదయనిధి సొంత ఆస్తుల విలువ స్వల్పంగా తగ్గగా, ఆయన భార్య ఆస్తులు మాత్రం రూ.1.15 కోట్ల నుండి ఏకంగా రూ.13.25 కోట్లకు పెరగడం గమనార్హం.
ఆస్తుల వివరాలతో పాటు తనపై ఉన్న కేసుల గురించి కూడా ఉదయనిధి అఫిడవిట్‌లో ప్రస్తావించారు.తనపై మొత్తం 10 క్రిమినల్ కేసులు పెండింగ్‌లో ఉన్నట్లు తెలిపారు. వాహనాల విషయానికి వస్తే, ఆయన వద్ద రూ.1 కోటి విలువైన ల్యాండ్ రోవర్ డిఫెండర్, రూ. 23 లక్షల విలువైన టొయోటా ఇన్నోవా కార్లు ఉన్నాయి. కాగా కోట్లాది రూపాయల ఆస్తులు ఉన్నప్పటికీ ఆయనకు ఎటువంటి అప్పులు (Liabilities) లేవని పేర్కొన్నారు. 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను తన వార్షిక ఆదాయం కేవలం రూ.10.40 లక్షలు మాత్రమేనని ఆయన అఫిడవిట్‌లో వెల్లడించారు. రెండోసారి అదే నియోజకవర్గం నుండి పోటీ చేస్తున్న ఉదయనిధికి ఈ ఎన్నికలు అత్యంత ప్రతిష్టాత్మకంగా మారాయి.






