ఇన్‌‌స్టాలో వీడియో పోస్ట్‌లను రీల్స్‌గా చేసుకునే అవకాశం.!

by Disha Web |
ఇన్‌‌స్టాలో వీడియో పోస్ట్‌లను రీల్స్‌గా చేసుకునే అవకాశం.!
X

దిశ, ఫీచర్స్ : ప్రముఖ ఫొటో, వీడియో షేరింగ్ ప్లాట్‌ఫామ్ ఇన్‌స్టా తన యూజర్ల కోసం అదిరిపోయే ఫీచర్లను తీసుకొస్తోంది. ఈ ఏడాదిలో ఇప్పటికే ఇంట్రడ్యూస్ చేసిన పలు ఆకర్షణీయమైన ఫీచర్లతో యూజర్ ఎక్స్‌పీరియన్స్ మరింత మెరుగు పడింది. ఈ క్రమంలోనే వీడియో పోస్ట్‌లను రీల్స్‌గా మార్చేందుకు ప్రయత్నాలు జరుపుతోంది ఇన్‌స్టా.

ఇన్‌స్టామ్ వీడియో పోస్ట్‌లను రీల్స్‌గా మార్చే ప్రక్రియ ప్రస్తుతం టెస్టింగ్ దశలో ఉన్నట్లు మెటా వెల్లడించింది. వీడియో ఎక్స్‌పీరియెన్స్‌ను సులభతరం చేసేందుకు గాను ఈ ఫీచర్‌‌ను త్వరలోనే తీసుకొస్తున్నట్లు పేర్కొంది. దీంతో పాటు 'పిన్ టు యువర్ ప్రొఫైల్(Pin To Your Profile)' ఫీచర్‌ను కూడా లాంచ్ చేయనుంది. దీంతో యూజర్లు తమకు నచ్చిన మూడు పోస్టులను లేదా రీల్స్‌‌ను ప్రొఫైల్ గ్రిడ్‌లో టాప్ ప్లేస్‌ ఉంచుకోవచ్చు. అంటే ఇన్‌స్టా ప్రొఫైల్ ఓపెన్ చేయగానే మీకు నచ్చిన మూడు పోస్టులు అందరికీ టాప్‌లో కనిపిస్తాయి. అయితే ట్విట్టర్‌, వాట్సాప్‌ సైట్స్‌లో ఇప్పటికే పిన్ చేసే ఆప్షన్ అందుబాటులో ఉండగా త్వరలోనే ఈ ఫీచర్ ఇన్‌స్టా యూజర్లకు అందుబాటులోకి రానుంది.


Read latest Telugu news disha daily epaper

Next Story

Most Viewed