భారీగా పెరిగిన భారత పన్ను వసూళ్లు!

by Disha Web Desk 17 |
భారీగా పెరిగిన భారత పన్ను వసూళ్లు!
X

న్యూఢిల్లీ: 2021-22 ఆర్థిక సంవత్సరంలో ఆదాయం, ఇతర ప్రత్యక్ష పన్నులతో పాటు పరోక్ష పన్నులు పెరగడంతో భారత పన్ను వసూళ్లు రికార్డు స్థాయిలో రూ. 27.07 లక్షల కోట్లకు చేరుకున్నాయని రెవెన్యూ కార్యదర్శి తరుణ్ బజాజ్ తెలిపారు. ఈ ఏడాది మార్చి 31 నాటికి మొత్తం ఆర్థిక సంవత్సరంలో ఈ మొత్తం వసూలయ్యాయని ఆయన పేర్కొన్నారు. ఇది బడ్జెట్ అంచనా రూ. 22.17 లక్షల కోట్ల కంటే ఎక్కువ కావడం గమనార్హం. ప్రత్యక్ష పన్నుల పరిధిలోకి వచ్చే వ్యక్తిగత ఆదాయ, కార్పొరేట్ పన్నులు మొత్తం రూ. 14.10 లక్షల కోట్లుగా ఉన్నాయి. ఇది బడ్జెట్ అంచనాల కంటే రూ. 3.02 లక్షల కోట్లు ఎక్కువ. కేవలం ఎక్సైజ్ సుంకం నుంచి మాత్రమే రూ. 1.88 లక్షల కోట్లు వచ్చాయన్నారు. ప్రత్యక్ష పన్నుల్లో 49 శాతం వృద్ధి నమోదవగా, పరోక్ష పన్నులు 30 శాతం పెరిగాయని తెలిపారు. దేశ జీడీపీలో పన్నుల వాటా 11.7 శాతం పెరిగిందని, 1999 ఏడాది తర్వాత ఇదే అత్యధిక పెరుగుదల అని తరుణ్ బజాజ్ వెల్లడించారు.

Next Story