- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
6.7 బిలియన్ డాలర్లు తగ్గిన భారత్ విదేశీ మారకం నిల్వలు
గత వారంలో 6.7 బిలియన్ డాలర్ల విదేశీ మారక నిల్వలు తగ్గినట్టు RBI పేర్కొంది.

దిశ, వెబ్ డెస్క్ : భారతీయ రిజర్వ్ బ్యాంక్(Reserve Bank of India) విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం విదేశీ మారక నిల్వలు(Forex Reserves) తగ్గాయి. ఫిబ్రవరి 6తో ముగిసిన వారానికి విదేశీ మారక నిల్వలు 6.711 బిలియన్ డాలర్లు తగ్గి 717.064 బిలియన్ డాలర్లకు చేరాయి. అలాగే జనవరి 30తో ముగిసిన వారానికి నిల్వలు 723.774 బిలియన్ డాలర్లు ఉండగా.. తదుపరి వారంలోనే 6.7 బిలియన్ డాలర్లు తగ్గడం గమనార్హం.
ఈ తగ్గుదల ప్రధాన కారణం గోల్డ్ రిజర్వ్స్ విలువ పడిపోవడమేనని నిపుణులు చెబుతున్నారు. గోల్డ్ రిజర్వ్స్ 14.208 బిలియన్ డాలర్లు తగ్గి 123.476 బిలియన్ డాలర్లకు చేరాయి. అంతర్జాతీయ బంగారం ధరల్లో మార్పులు రావడంతో వాల్యుయేషన్ లాస్ ఏర్పడింది. అయితే మరోవైపు, ఫారిన్ కరెన్సీ అసెట్స్ (FCA) 7.661 బిలియన్ డాలర్లు పెరిగి 570.053 బిలియన్ డాలర్లకు చేరడం గమనార్హం. స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ (SDRs), IMF రిజర్వ్ పొజిషన్ కూడా స్వల్పంగా తగ్గాయి. ఓవర్ ఆల్ గా ఈ వారంలో విదేశీ మారక నిల్వలు 6.7 బిలియన్ డాలర్ల మేర తగ్గినప్పటికీ విదేశీ మారక నిల్వల స్థాయి ఇప్పటికీ బలంగా ఉందని ఆర్థిక విశ్లేషకులు భావిస్తున్నారు.






